Telugu Global
Cinema & Entertainment

మంచు విష్ణుపై సీఎం జగన్ సెటైర్

టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఎక్కువమంది పిల్లలున్న హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు మంచు విష్ణు. ఇదే విషయంపై అతడ్ని ప్రశ్నిస్తే తనకు పిల్లలంటే ఇష్టం అని చెబుతున్నాడు. మోసగాళ్లు మూవీ ప్రమోషన్ లో భాగంగా మాట్లాడిన మంచు విష్ణు.. పిల్లలకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ తనపై వేసిన సెటైర్ ను గుర్తుచేసుకొని నవ్వుకున్నాడు. “పిల్లలంటే నాకు బాగా ఇష్టం. ఇంకా మరికొంతమంది పిల్లలు కావాలని నా భార్యను అడిగాను. నా వల్ల కాదు, ఇంకెవరినైనా చూస్కో అంటూ విసుక్కుంది. […]

మంచు విష్ణుపై సీఎం జగన్ సెటైర్
X

టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఎక్కువమంది పిల్లలున్న హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు మంచు విష్ణు. ఇదే
విషయంపై అతడ్ని ప్రశ్నిస్తే తనకు పిల్లలంటే ఇష్టం అని చెబుతున్నాడు. మోసగాళ్లు మూవీ ప్రమోషన్
లో భాగంగా మాట్లాడిన మంచు విష్ణు.. పిల్లలకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ తనపై వేసిన సెటైర్ ను
గుర్తుచేసుకొని నవ్వుకున్నాడు.

“పిల్లలంటే నాకు బాగా ఇష్టం. ఇంకా మరికొంతమంది పిల్లలు కావాలని నా భార్యను అడిగాను. నా వల్ల
కాదు, ఇంకెవరినైనా చూస్కో అంటూ విసుక్కుంది. దీనిపై ఓసారి జగన్ అన్న కూడా నాపై సెటైర్ వేశారు.
నా భార్య నాలుగో బిడ్డకు జన్మనివ్వడానికి గర్భవతి అయినప్పుడు.. అదే విషయాన్ని జగన్ అన్నతో
చెప్పాను. నా చెల్లెల్ని వేధించడం ఆపెయ్ అన్నారు జగన్. ఇద్దరం బాగా నవ్వుకున్నాం.”

పెళ్లికి ముందు కూడా తను పిల్లలతో ఎక్కువగా గడిపేవాడినని, అనాథ శరణాలయాలకు వెళ్లేవాడినని
అన్నాడు విష్ణు. అయితే మరింతమంది పిల్లల కోసం తన భార్య ఇచ్చిన ఆఫర్ మాత్రం తనకు అర్థం
కావడం లేదంటున్నాడు.

“పిల్లల కోసం వేరే అమ్మాయిని చూసుకోమని నా భార్య ఆఫర్ ఇచ్చింది. నిజంగానే నా భార్య నాకు ఆ ఆఫర్ ఇచ్చిందా అనే విషయం అర్థంకాలేదు. మళ్లీ అడగడానికి ధైర్యం సరిపోలేదు.”

ఇలా పిల్లలకు సంబంధించి తనపై తానే సెటైర్లు వేసుకున్నాడు ఈ హీరో. హైదరాబాద్ సిటీలో ఓ భారీ
ఇల్లు కడుతున్నాడు ఈ హీరో. ప్రస్తుతం తండ్రి మోహన్ బాబు, విష్ణు కుటుంబం కలిసి ఉండడం లేదు.
కొత్త ఇల్లు రెడీ అయిన తర్వాత అంతా అందులోకి షిఫ్ట్ అవుతారు.

First Published:  15 March 2021 1:22 PM IST
Next Story