ఆర్ఆర్ఆర్ నుంచి అలియా ఫస్ట్ లుక్
ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫస్ట్ లుక్స్ రిలీజయ్యాయి. ఇప్పుడు మరో కీలక పాత్రధారి అలియాభట్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ లో సీత పాత్ర పోషించిన ఆమె లుక్ ను విడుదల చేశారు. సినిమాలో అచ్చతెలుగు అమ్మాయిగా కనిపిస్తోంది అలియా. ఆమె పాత్ర పేరు సీత. రామరాజు కోసం ఎదురుచూసే ప్రేయసి పాత్రలో ఆమె కనిపించబోతోంది. అంతేకాదు.. గుండె నిండా ధైర్యం ఉన్న […]
ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫస్ట్ లుక్స్ రిలీజయ్యాయి. ఇప్పుడు
మరో కీలక పాత్రధారి అలియాభట్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా
ఆర్ఆర్ఆర్ లో సీత పాత్ర పోషించిన ఆమె లుక్ ను విడుదల చేశారు.
సినిమాలో అచ్చతెలుగు అమ్మాయిగా కనిపిస్తోంది అలియా. ఆమె పాత్ర పేరు సీత. రామరాజు కోసం
ఎదురుచూసే ప్రేయసి పాత్రలో ఆమె కనిపించబోతోంది. అంతేకాదు.. గుండె నిండా ధైర్యం ఉన్న మహిళ
కూడా. ఇలా సీత పాత్ర ఛాయల్ని బయటపెట్టాడు దర్శకుడు రాజమౌళి.
అలియాభట్ ఫస్ట్ లుక్ తో ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుకు బాలీవుడ్ లో క్రేజ్ ఏర్పడింది. సినిమాలో మరో కీలక
పాత్ర పోషించిన అజయ్ దేవగన్ లుక్ కూడా రిలీజైతే.. నార్త్ లో ఈ సినిమాకు మరింత క్రేజ్ పెరుగుతుంది.
ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా
నడుస్తున్నాయి. అక్టోబర్ 13న వరల్డ్ వైడ్ రిలీజ్ అవ్వబోతోంది ఆర్ఆర్ఆర్ సినిమా.