Telugu Global
NEWS

ఓట్లు వేయించండి.. డబ్బులు పంచేద్దాం.. టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే ఆఫర్​..!

ప్రస్తుతం తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. దుబ్బాక, జీహెచ్​ఎంసీ లో దెబ్బతిన్న అధికార టీఆర్​ఎస్​ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. ఎక్కడికక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారు. టీఆర్​ఎస్​ తన క్యాడర్​ను విస్తృతంగా వాడుకుంటున్నది. మంత్రుల నుంచి సర్పంచ్​ స్థాయి వరకు అందరూ తమ అభ్యర్థుల గెలుపుకోసం అన్ని విధాలా శ్రమిస్తున్నారు. ప్రచారం ముగియడంతో ప్రలోభాలకు తెరతీశారు. బీజేపీ, కాంగ్రెస్​ కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికలు […]

ఓట్లు వేయించండి.. డబ్బులు పంచేద్దాం.. టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే ఆఫర్​..!
X

ప్రస్తుతం తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. దుబ్బాక, జీహెచ్​ఎంసీ లో దెబ్బతిన్న అధికార టీఆర్​ఎస్​ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. ఎక్కడికక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారు. టీఆర్​ఎస్​ తన క్యాడర్​ను విస్తృతంగా వాడుకుంటున్నది. మంత్రుల నుంచి సర్పంచ్​ స్థాయి వరకు అందరూ తమ అభ్యర్థుల గెలుపుకోసం అన్ని విధాలా శ్రమిస్తున్నారు. ప్రచారం ముగియడంతో ప్రలోభాలకు తెరతీశారు.

బీజేపీ, కాంగ్రెస్​ కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. రెండు స్థానాల్లోనూ ఇండిపెండెంట్లు సైతం గట్టి పోటీ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా టీఆర్​ఎస్​ వైరా ఎమ్మెల్యే రాములు నాయక్​ మాట్లాడిన ఓ వీడియో వైరల్​గా మారింది. ‘ఓటర్లకు డబ్బులు పంచండి’ అంటూ ఆయన పార్టీ సమావేశంలో నేరుగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీంతో ప్రతిపక్షాలు టీఆర్​ఎస్​పై దుమ్మెత్తి పోస్తున్నాయి.

ప్రస్తుతం హైదరాబాద్​, మహబూబ్​నగర్​, రంగారెడ్డి స్థానానికి, నల్లగొండ, వరంగల్​, కరీంనగర్​, ఖమ్మం స్థానానికి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. వైరా నియోజకవర్గ బాధ్యతలను టీఆర్​ఎస్​ ఆ పార్టీ ఎమ్మెల్యే రాములునాయక్​కు అప్పగించింది. ఆయన ఇటీవల కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ.. ‘ ముందుగా ఓటర్​ లిస్ట్​ తెప్పించుకోండి. ఓటర్లను ఏబీసీడీలుగా వర్గీకరించండి. మనవాళ్లు ఎవరో గుర్తించండి. వాళ్లకు పక్కకు పెట్టి.. ఇతర పార్టీల వాళ్లను టార్గెట్​ చేసి ఓటు వెయ్యో.. రెండు వేలో పంచండి.. డబ్బుల గురించి భయపడకండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. మనపార్టీకి ఓటు వేయరు అనుకున్నవాళ్లను ముందుగా టార్గెట్​ చేయండి. వాళ్లకే డబ్బులు పంచండి’ అంటూ ఆయన కార్యకర్తలకు సూచించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ఎన్నిక ఏదైనా ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం మామూలే. అయితే ఓ ఎమ్మెల్యే నేరుగా పార్టీ సమావేశంలో ఇలా మాట్లాడటం .. అందుకు సంబంధించిన వీడియో బయటకు రావడం వివాదాస్పదంగా మారింది. ఈ విషయంపై ఎన్నికల సంఘం జోక్యం చేసుకోని సదరు ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని విపక్ష నేతలు కోరుతున్నారు.

First Published:  13 March 2021 12:51 PM IST
Next Story