Telugu Global
Cinema & Entertainment

మరో 2 రోజుల్లో సీత వచ్చేస్తోంది

ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ లుక్స్ బయటకొచ్చాయి. రామరాజు ఫర్ భీమ్.. భీమ్ ఫర్ రామరాజు పేరిట 2 టీజర్లు వచ్చేశాయి. వీటిలో చరణ్-తారక్ లుక్స్ ఏంటనే విషయంపై స్పష్టత వచ్చేసింది. ఇప్పుడు మరో కీలక పాత్రధారి అలియా భట్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో కనిపించనుంది అలియాభట్. ఆ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ ను 15వ తేదీ 11 […]

RRR Motion Poster
X

ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ లుక్స్ బయటకొచ్చాయి. రామరాజు
ఫర్ భీమ్.. భీమ్ ఫర్ రామరాజు పేరిట 2 టీజర్లు వచ్చేశాయి. వీటిలో చరణ్-తారక్ లుక్స్ ఏంటనే
విషయంపై స్పష్టత వచ్చేసింది. ఇప్పుడు మరో కీలక పాత్రధారి అలియా భట్ ఫస్ట్ లుక్ ను రిలీజ్
చేయబోతున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో కనిపించనుంది అలియాభట్. ఆ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్
తో పాటు టీజర్ ను 15వ తేదీ 11 గంటలకు విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు
రాజమౌళి స్వయంగా ప్రకటించాడు.

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. క్లైమాక్స్ పార్ట్ షూటింగ్ నడుస్తోంది. మరోవైపు
పోస్ట్ ప్రొడక్షన్ కోసం అచ్చంగా 5 నెలలు కేటాయించారు. అక్టోబర్ 13న ఆర్ఆర్ఆర్ సినిమా థియేటర్లలోకి
రాబోతోంది. అజయ్ దేవగన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

First Published:  13 March 2021 10:50 AM IST
Next Story