Telugu Global
Cinema & Entertainment

ఘనంగా మెహ్రీన్ నిశ్చితార్థం

హీరోయిన్ మెహ్రీన్ నిశ్చితార్థం పూర్తయింది. జైపూర్ లోని ఓ కోటలో బంధువుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా మెహ్రీన్-భవ్య ఎఁగేజ్ మెంట్ పూర్తయింది. కాబోయే భార్యాభర్తలిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. ఈ ఏడాదిలోనే మెహ్రీన్-భవ్య వివాహం జరుగుతుంది. పెళ్లి తేది, వేదిక డీటెయిల్స్ త్వరలోనే బయటకొస్తాయి. హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనవడే భవ్య. గత నెల వాలంటైన్స్ డే సందర్భంగా తనకు కాబోయే భర్త భవ్య వివరాల్ని బయటపెట్టింది మెహ్రీన్. పెద్దలు కుదిర్చిన సంబంధమే అయినప్పటికీ.. చాన్నాళ్లుగా వీళ్లిద్దరూ ఒకరికొకరు దగ్గరయ్యారు. […]

ఘనంగా మెహ్రీన్ నిశ్చితార్థం
X

హీరోయిన్ మెహ్రీన్ నిశ్చితార్థం పూర్తయింది. జైపూర్ లోని ఓ కోటలో బంధువుల సమక్షంలో
సంప్రదాయబద్ధంగా మెహ్రీన్-భవ్య ఎఁగేజ్ మెంట్ పూర్తయింది. కాబోయే భార్యాభర్తలిద్దరూ ఉంగరాలు
మార్చుకున్నారు.

ఈ ఏడాదిలోనే మెహ్రీన్-భవ్య వివాహం జరుగుతుంది. పెళ్లి తేది, వేదిక డీటెయిల్స్ త్వరలోనే
బయటకొస్తాయి. హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనవడే భవ్య.

గత నెల వాలంటైన్స్ డే సందర్భంగా తనకు కాబోయే భర్త భవ్య వివరాల్ని బయటపెట్టింది మెహ్రీన్.
పెద్దలు కుదిర్చిన సంబంధమే అయినప్పటికీ.. చాన్నాళ్లుగా వీళ్లిద్దరూ ఒకరికొకరు దగ్గరయ్యారు.

ప్రస్తుతం ఎఫ్3 సినిమా చేస్తోంది మెహ్రీన్. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆమె పెళ్లిచేసుకుంటుంది. పెళ్లి
తర్వాత సినిమాల్లో కొనసాగుతుందా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

First Published:  13 March 2021 9:46 AM IST
Next Story