జాతిరత్నాలు మూవీ రివ్యూ
నటీనటులు – నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ఫరియా అబ్దుల్లా, మురళిశర్మ, నరేష్ వి.కె, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్ తదితరులు రచన-దర్శకత్వం – అనుదీప్ కేవీ నిర్మాత: నాగ్ అశ్విన్ బ్యానర్: స‌్వప్న సినిమా సంగీతం: రథన్ సెన్సార్: U రిలీజ్ డేట్: మార్చి 11, 2012 రేటింగ్: 3/5 ప్రమోషన్ లో ఏం చెప్పామో సినిమాలో అది చూపించాలి. ఏమాత్రం ప్రచారం తేడా కొట్టినా సినిమా రిజల్ట్ మారిపోతుంది. ఇలా ఫ్లాప్ […]
నటీనటులు – నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ఫరియా అబ్దుల్లా, మురళిశర్మ, నరేష్ వి.కె,
బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్ తదితరులు
రచన-దర్శకత్వం – అనుదీప్ కేవీ
నిర్మాత: నాగ్ అశ్విన్
బ్యానర్: స‌్వప్న సినిమా
సంగీతం: రథన్
సెన్సార్: U
రిలీజ్ డేట్: మార్చి 11, 2012
రేటింగ్: 3/5
ప్రమోషన్ లో ఏం చెప్పామో సినిమాలో అది చూపించాలి. ఏమాత్రం ప్రచారం తేడా కొట్టినా సినిమా రిజల్ట్
మారిపోతుంది. ఇలా ఫ్లాప్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. ట్రయిలర్, ప్రచారంలో ఒకటి చెప్పడం..
థియేటర్లలోకి వెళ్లిన తర్వాత మరొకటి చూపించి భంగపాటు పడడం చాలా సినిమాల విషయంలో
జరిగింది. కానీ జాతిరత్నాలు మాత్రం చెప్పిందే చూపించింది. అనుకున్న టార్గెట్ సాధించింది.
కంప్లీట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాకు ప్రచారం కల్పించారు మేకర్స్. చెప్పినట్టుగానే వంద శాతం
నవ్వులు పంచారు జాతిరత్నాలు. సినిమా ఓపెనింగ్ షాట్ నుంచి శుభం కార్డు వరకు నవ్వులు
పూయించడమే పనిగా పెట్టుకున్నాడు దర్శకుడు. ఆ విషయంలో నూటికి నూరు పాళ్లు సక్సెస్ అయ్యాడు.
కథ పరంగా చూసుకుంటే జాతిరత్నాల్లో ఏం లేదు.. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఉంటున్న శ్రీకాంత్ (నవీన్
పొలిశెట్టి), రవి (రాహుల్ రామకృష్ణ), శేఖర్ (ప్రియదర్శి) బెస్ట్ ఫ్రెండ్స్. కాకపోతే ముగ్గురూ ఆవారాలే. ఊళ్లో
వాళ్లంతా వీళ్లను అసహ్యించుకుంటారు. దీంతో హైదరాబాద్ వెళ్లి 2 నెలల్లో ఉద్యోగం సంపాదిస్తానని తన
తండ్రితో ఛాలెంజ్ చేస్తాడు శ్రీకాంత్. అతడితో పాటు రవి, శేఖర్ కూడా హైదరాబాద్ వెళ్తారు. అక్కడ చిట్టి
(ఫరియా అబ్దుల్లా)తో ప్రేమలో పడతాడు శ్రీకాంత్. అంతా సజావుగా సాగుతుందనుకున్న టైమ్ లో మంత్రి
చాణక్య (మురళీ శర్మ) పుట్టినరోజు పార్టీకి వెళ్తారు వీళ్లు ముగ్గురు. అక్కడ అనుకోకుండా చాణక్యపై మర్డర్
ఎటెంప్ట్ జరుగుతుంది. ఆ కేసు వీళ్ల ముగ్గురిపై పడుతుంది. ఈ కేసు నుంచి ఈ ముగ్గురు ఎలా
బయటపడ్డారు. ఫైనల్ గా మంత్రిపై హత్యాయత్నానికి పాల్పడింది ఎవరు అనేది జాతిరత్నాలు స్టోరీ.
స్టోరీగా చెప్పుకుంటే ఇందులో క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ ఇలా చాలా అంశాలు కనిపిస్తాయి. కానీ సినిమాలో
మాత్రం ఓన్లీ కామెడీ కనిపిస్తుంది. నవీన్, ప్రియదర్శి, రాహుల్ తమ కామెడీ టైమింగ్స్ తో అదరగొట్టారు. వీళ్లు ముగ్గురనే కాదు, సినిమాలో ప్రతి పాత్ర నవ్వించింది. ఇక టెక్నికల్ గా సినిమాలో చెప్పుకోడానికేం లేదు. రథన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ లౌడ్ గా ఉంది. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటింగ్ ఫర్వాలేదు.
ఓవరాల్ గా పూర్తి కామెడీ ఎలిమెంట్స్ తో, సంచుల కొద్దీ పంచులతో వచ్చిన జాతిరత్నాలు సినిమా థియేటర్లలో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తోంది.