Telugu Global
Health & Life Style

వ్యాక్సిన్ పూర్తి సేఫ్ ఎందుకంటే..

వ్యాక్సిన్ తీసుకుంటే యాంటీ బాడీలు డెవలప్ అవుతాయని, అందుకే తమ వంతు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ తప్పని సరిగా టీకా తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. మరో పక్క వ్యాక్సిన్ పై కొంతమందికి అనుమానాలు కూడా లేకపోలేదు. అయితే ఏది ఏమైనా వ్యాక్సిన్ తో కచ్చితంగా లాభమే ఉండి తీరుతుందంటున్నారు నిపుణులు. యాంటీబాడీలు ఉత్పత్తి అవ్వకపోయినా.. వ్యాక్సిన్‌తో ప్రయోజనమే అంటున్నారు. రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా కొందరిలో యాంటీబాడీలు వృద్ధి చెందడంలేదని పరిశోధకులు గుర్తించారు. అయితే […]

వ్యాక్సిన్ పూర్తి సేఫ్ ఎందుకంటే..
X

వ్యాక్సిన్ తీసుకుంటే యాంటీ బాడీలు డెవలప్ అవుతాయని, అందుకే తమ వంతు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ తప్పని సరిగా టీకా తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. మరో పక్క వ్యాక్సిన్ పై కొంతమందికి అనుమానాలు కూడా లేకపోలేదు. అయితే ఏది ఏమైనా వ్యాక్సిన్ తో కచ్చితంగా లాభమే ఉండి తీరుతుందంటున్నారు నిపుణులు. యాంటీబాడీలు ఉత్పత్తి అవ్వకపోయినా.. వ్యాక్సిన్‌తో ప్రయోజనమే అంటున్నారు.

రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా కొందరిలో యాంటీబాడీలు వృద్ధి చెందడంలేదని పరిశోధకులు గుర్తించారు. అయితే వాటి ప్లేస్ లో కణాధారిత రోగ నిరోధక శక్తిని పెంపొందించే టి కణాలు వృద్ధి చెందుతాయని గుర్తించారు. అందుకే యాంటీబాడీలు వృద్ధి చెందకపోయినా ఫర్వాలేదని, వ్యాక్సిన్ మాత్రం తీసుకోవడమే సేఫ్ అని వాళ్లు సూచిస్తున్నారు. టీకా వల్ల అన్ని విధాలుగా ప్రయోజనాలే ఉంటాయని అంటున్నారు.

అంతేకాదు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వైరస్‌ బారినపడినా.. దాని ప్రభావం చాలా స్వల్పంగా ఉంటుందని వివరిస్తున్నారు. వ్యాక్సిన్ తర్వాత వైరస్ సోకినా.. స్వల్ప లక్షణాలు, చికిత్సతోనే బయటపడే అవకాశాలుంటాయంటున్నారు. కొవిడ్‌ను ఎదుర్కోవడంలో టీకాలు సమర్థ పాత్ర పోషిస్తాయని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా దిగ్గజ వైద్యనిపుణులు కూడా సూచిస్తున్నారు.

First Published:  12 March 2021 7:43 AM IST
Next Story