Telugu Global
NEWS

నిమ్మగడ్డ అరుణాచల్​ప్రదేశ్​ టూర్​..! ఎన్నికల పరిస్థితి ఏమిటి?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి .. ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్​కు చాలా కాలంగా కోల్డ్​వార్​ సాగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికలు పెట్టొద్దని ప్రభుత్వం.. పెట్టి తీరాల్సిందేనని నిమ్మగడ్డ ఇలా కొంతకాలం పాటు సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు కోర్టు తీర్పుతో ఎన్నికలు జరిగాయి. అయితే ఎలక్షన్​ కోడ్​ అమల్లోకి వచ్చాక నిమ్మగడ్డ తన అధికారం ఏమిటో చూపించారు. వరసగా కీలక అధికారుల బదిలీలు.. మంత్రులకు వార్నింగ్​తో ప్రభుత్వానికి చుక్కలు చూపించారు. దౌర్జన్యాలు జరిగే ప్రాంతాల్లో స్వయంగా పర్యటించారు. అయితే […]

నిమ్మగడ్డ అరుణాచల్​ప్రదేశ్​ టూర్​..! ఎన్నికల పరిస్థితి ఏమిటి?
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి .. ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్​కు చాలా కాలంగా కోల్డ్​వార్​ సాగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికలు పెట్టొద్దని ప్రభుత్వం.. పెట్టి తీరాల్సిందేనని నిమ్మగడ్డ ఇలా కొంతకాలం పాటు సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు కోర్టు తీర్పుతో ఎన్నికలు జరిగాయి. అయితే ఎలక్షన్​ కోడ్​ అమల్లోకి వచ్చాక నిమ్మగడ్డ తన అధికారం ఏమిటో చూపించారు. వరసగా కీలక అధికారుల బదిలీలు.. మంత్రులకు వార్నింగ్​తో ప్రభుత్వానికి చుక్కలు చూపించారు. దౌర్జన్యాలు జరిగే ప్రాంతాల్లో స్వయంగా పర్యటించారు. అయితే నిమ్మగడ్డ టీడీపీ అధినేత చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా వ్యవహరిస్తున్నారని అధికార పక్షం ఆరోపణలు చేసింది. పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఆ వెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.

కానీ నిమ్మగడ్డ రమేశ్​ సడెన్​గా ఓ ట్విస్ట్​ ఇచ్చారు. ఆయన ఆకస్మికంగా సెలవు పెట్టారు. ఈ నెల 17 నుంచి 24 వరకు సెలవులో ఉండనున్నారు. అయితే ఇప్పటివరకు నిమ్మగడ్డను ఆకాశానికి ఎత్తేసిన ఓ వర్గం మీడియా, టీడీపీ నేతలు పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే స్వరం మార్చాయి. నిమ్మగడ్డ మారిపోయారంటూ విమర్శలు చేయడం మొదలు పెట్టాయి. ఏకంగా చంద్రబాబే ఎన్నికల సంఘం పనితీరుపై విమర్శలు గుప్పించారు. ఈ పరిస్థితుల్లో నిమ్మగడ్డ సెలవులో వెళ్లడం ఆసక్తికరంగా మారింది.

ఎందుకంటే ఈ నెల 31 తో ఆయన పదవీకాలం ముగియనున్నది. ఆయన 24 తేదీ వరకు సెలవులో ఉండబోతున్నారు. అంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఆయన హయాంలో జరిగే అవకాశం లేదు. అయితే ఆయన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్​ విడుదల చేసి వెళతారా? లేక కొత్త కమిషనరే ఆ బాధ్యతలు నిర్వహిస్తారా? అన్న అంశంపై ఇంకా క్లారిటీ లేదు.

First Published:  12 March 2021 10:12 AM IST
Next Story