Telugu Global
Cinema & Entertainment

ఆదిపురుష్ హీరోయిన్ ఫిక్స్

ఓం రౌత్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా రామాయణం ఇతివృత్తంగా ‘ఆదిపురుష్’ అంటూ ప్రకటన రాగానే ఈ సినిమాలో సీత పాత్రలో నటించనున్న హీరోయిన్ ఎవరు ? అనే ప్రశ్న అందరిలోనూ మొదలైంది. ఈ క్వశ్చన్ కి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ తో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. హై టెక్నికల్ వాల్యూస్ తో మోషన్ క్యాప్చర్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి సనన్ ని ఎంపిక చేశారు. ఆమెకి గ్రాండ్ గా వెల్ […]

ఆదిపురుష్ హీరోయిన్ ఫిక్స్
X

ఓం రౌత్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా రామాయణం ఇతివృత్తంగా ‘ఆదిపురుష్’ అంటూ ప్రకటన రాగానే ఈ సినిమాలో సీత పాత్రలో నటించనున్న హీరోయిన్ ఎవరు ? అనే ప్రశ్న అందరిలోనూ మొదలైంది. ఈ క్వశ్చన్ కి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ తో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. హై టెక్నికల్ వాల్యూస్ తో మోషన్ క్యాప్చర్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి సనన్ ని ఎంపిక చేశారు. ఆమెకి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు.

హీరోయిన్ కృతితో పాటు సినిమాలో మరో కీలక పాత్రలో నటించనున్న సన్నీ సింగ్ కి కూడా సోషల్ మీడియా ద్వారా వెల్కం చెప్పాడు ప్రభాస్. సన్నీ లక్ష్మణుడిగా కనిపించనున్నాడు. ఈ ఇద్దరి ఎంపికతో ఆల్మోస్ట్ కీలక పాత్రల ఎంపిక పూర్తి చేసారు మేకర్స్. రావణుడిగా సైఫ్ ఇదివరకే సెలక్ట్ అయిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ముంబైలో షూట్ జరుపుకుంటున్న ఈ సినిమాను టీ-సిరీస్ బేనర్ పై భూషణ్ కుమార్ నిర్మిస్తున్నాడు. కృతికి తెలుగులో ఇది మూడో సినిమా. ఇంతకుముందు ఆమె మహేష్, నాగచైతన్య సినిమాల్లో నటించింది.

First Published:  12 March 2021 12:18 PM IST
Next Story