Telugu Global
Others

రూ.300కోట్లతో తిరుపతిలో చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి...

టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి ఒప్పందం కుదిరింది. ముంబైకి చెందిన ఉద్వేగ్‌ ఇన్ ‌ఫ్రా స్ట్రక్చ‌ర్ అండ్ క‌న్స‌ల్టెన్సీ ప్రైవెట్ లిమిటెడ్ (యు.ఐ.సి) సంస్థ ఈ ఆస్పత్రి నిర్మాణానికి ముందుకొచ్చింది. రూ.300కోట్ల రూపాయల నిధులు విరాళంగా అందించడంతోపాటు.. ఆస్పత్రి నిర్మాణం, నిర్వహణ కూడా యూఐసీ సంస్థ చేపట్టబోతోంది. స్విమ్స్ కి అనుబంధంగా ఈ ఆస్పత్రి పనిచేస్తుంది. ఈమేరకు టీటీడీ ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ ‌రెడ్డి, యూఐసీ సంస్థ సీఈవో, ఎండీ […]

రూ.300కోట్లతో తిరుపతిలో చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి...
X

టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి ఒప్పందం కుదిరింది. ముంబైకి చెందిన ఉద్వేగ్‌ ఇన్ ‌ఫ్రా స్ట్రక్చ‌ర్ అండ్ క‌న్స‌ల్టెన్సీ ప్రైవెట్ లిమిటెడ్ (యు.ఐ.సి) సంస్థ ఈ ఆస్పత్రి నిర్మాణానికి ముందుకొచ్చింది. రూ.300కోట్ల రూపాయల నిధులు విరాళంగా అందించడంతోపాటు.. ఆస్పత్రి నిర్మాణం, నిర్వహణ కూడా యూఐసీ సంస్థ చేపట్టబోతోంది. స్విమ్స్ కి అనుబంధంగా ఈ ఆస్పత్రి పనిచేస్తుంది. ఈమేరకు టీటీడీ ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ ‌రెడ్డి, యూఐసీ సంస్థ సీఈవో, ఎండీ సంజ‌య్ కె.సింగ్‌ పరస్పర అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈ లాంఛనం పూర్తయింది.

రాష్ట్ర విభ‌జ‌న అనంతరం ఆంధ్ర ప్ర‌దేశ్ ‌లో చిన్నపిల్లలకు ప్రత్యేక వైద్య సేవలు అందించే ఆస్పత్రులను తిరుపతి, విశాఖ, విజయవాడలో ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి నిర్ణయించారని, అందులో భాగంగానే తొలుత తిరుపతిలో ఈ ఆస్పత్రి నిర్మించబోతున్నామని తెలిపారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. శ్రీ‌వారి అనుగ్ర‌హంతో ముంబైకి చెందిన యూఐసీ సంస్థ అధినేత రూ.300కోట్లు విరాళంగా అందించేందుకు ముందుకొచ్చారని, వారికి శ్రీవారి ఆశీస్సులు సదా ఉండాలని ఆకాంక్షించారు.

ఇప్ప‌టికే విద్య‌, వైద్య రంగాల‌లో విశేష సేవ‌లు అందిస్తున్న టీటీడీ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ ఆస్పత్రి ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు ఈవో జవహర్ రెడ్డి. త్వ‌ర‌లో ఆసుప‌త్రి నిర్మాణానికి భూమి పూజ చేస్తామని చెప్పారాయన.

తిరుపతిలో చిన్న పిల్ల‌ల‌ ఆస్పత్రి నిర్మించేందుకు శ్రీ‌వారి ఆశీస్సులు లభించడం సంతోషంగా ఉందని అన్నారు దాత సంజయ్ కె.సింగ్. చిన్న పిల్ల‌ల‌కు వైద్య సేవలందించేందుకు టీటీడీతో ఒప్పందం చేసుకోవడం తమకో గొప్ప అవకాశంగా భావిస్తున్నట్టు చెప్పారు. దీనికి సహకారం అందించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవరహ్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

First Published:  12 March 2021 5:49 PM IST
Next Story