Telugu Global
Cinema & Entertainment

యంగ్ నారప్ప ఇతడే

సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి, వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా విక్టరి వెంకటేష్ హీరోగా, మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న భారీ చిత్రం `నారప్ప`. విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటినుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో సుందరమ్మగా తెలుగు వారికి చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన గ్లిమ్స్‌, […]

యంగ్ నారప్ప ఇతడే
X

సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి, వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా విక్టరి వెంకటేష్ హీరోగా, మనసుకు
హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు,
కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న భారీ చిత్రం 'నారప్ప'.

విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటినుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ
మూవీలో సుందరమ్మగా తెలుగు వారికి చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి
ఇప్ప‌టికే విడుద‌లైన గ్లిమ్స్‌, పోస్ట‌ర్లకు మంచి స్పంద‌న వ‌చ్చింది. విక్ట‌రీ వెంక‌టేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా
రిలీజైన 'నార‌ప్ప' టీజ‌ర్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్ప‌టికే షూటింగ్ చేసుకున్న ఈ చిత్రం
ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది.

మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా స్పెష‌ల్ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఇప్పటివరకు ఓల్డ్ లుక్
గెటప్స్‌తో మెప్పించిన వెంక‌టేష్ ఈసారి యంగ్ లుక్ లో క‌నిపించి ప్రేక్ష‌కుల్నిస‌ర్‌ప్రైజ్ చేశారు. విక్ట‌రి
వెంక‌టేష్ యంగ్ లుక్‌లో ఉన్న ఈ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఫ్యామిలీ ఎమోషన్స్ హైలెట్‌గా
తెరకెక్కుతున్న ‘నారప్ప’ స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

First Published:  11 March 2021 2:54 PM IST
Next Story