Telugu Global
Health & Life Style

జాగింగ్‌కు ప్రిపేర్ అవ్వండిలా..

రోజూ జాగింగ్ చేసే అలవాటుంటుంది చాలామందికి. అయితే జాగింగ్‌ చేసేవారు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే.. జాగింగ్‌ చేయడానికి ఓ అరగంట ముందు చాలా తేలికపాటి ఆహారం తీసుకోవాలి. కొద్దిగా కార్బోహైడ్రేట్లు, ఏదైనా ఫ్రూట్, పాలు లాంటివి కూడా తీసుకోవచ్చు. అలాగే జాగింగ్‌ చేయడానికి ముందే వాటర్ బాటిల్‌ వెంట ఉంచుకోవాలి. జాగింగ్ ముగిసిన ఐదు పది నిముషాల తర్వాత నీళ్లు తాగాలి. జాగింగ్ చేసేటప్పుడు మోకాళ్లు, అరికాళ్ల కీళ్లపై ఒత్తిడి పడే […]

జాగింగ్‌కు ప్రిపేర్ అవ్వండిలా..
X

రోజూ జాగింగ్ చేసే అలవాటుంటుంది చాలామందికి. అయితే జాగింగ్‌ చేసేవారు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే..
జాగింగ్‌ చేయడానికి ఓ అరగంట ముందు చాలా తేలికపాటి ఆహారం తీసుకోవాలి. కొద్దిగా కార్బోహైడ్రేట్లు, ఏదైనా ఫ్రూట్, పాలు లాంటివి కూడా తీసుకోవచ్చు.
అలాగే జాగింగ్‌ చేయడానికి ముందే వాటర్ బాటిల్‌ వెంట ఉంచుకోవాలి. జాగింగ్ ముగిసిన ఐదు పది నిముషాల తర్వాత నీళ్లు తాగాలి.
జాగింగ్ చేసేటప్పుడు మోకాళ్లు, అరికాళ్ల కీళ్లపై ఒత్తిడి పడే ప్రమాదముంది. అందుకే జాగింగ్ కు సరైన షూస్ ఎంచుకోవాలి. అలాగే గట్టిగా ఉండే తారురోడ్డుపై జాగింగ్ చేయడం అంత మంచిది కాదు.
రోజుకు ఇరవై నుంచి ముప్ఫై నిముషాల జాగింగ్ సరిపోతుంది. జాగింగ్ కు అనువైన బట్టలు ఎంచుకోవాలి. జాగింగ్ మరీ ఎక్కువగా లేదా మరీ తక్కువగా కాకుండా సరైన స్పీడ్ లో చేయాలి.
జాగింగ్‌ను ఓ క్రమ పద్ధతిలో సరైన రీతిలో చేయాలి. అలాగే జాగింగ్‌కు ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. జాగింగ్ హై ఇంటెన్సిటీ వర్కవుట్ కాబట్టి కేవలం క్యాలరీలు మాత్రమే ఖర్చయ్యేలా ప్రొటీన్ లాస్ అవ్వకుండా జాగ్రత్త పడాలి.

First Published:  10 March 2021 9:00 AM IST
Next Story