Telugu Global
NEWS

ఫ్రస్టేషన్.. ఫ్రస్టేషన్.. ఫ్రస్టేషన్..

మొన్న ఫొటోగ్రాఫర్ కి బాలకృష్ణ చెంపదెబ్బ, నిన్న మహిళా కార్యకర్తకి అశోక్ గజపతిరాజు చేతి దెబ్బ, నేడు జేసీ ప్రభాకర్ రెడ్డి తన సొంత అనుచరుడిపై వీరంగం.. ఇవన్నీ చూస్తుంటే టీడీపీ నేతలు ఎంత ఫ్రస్టేషన్లో ఉన్నారో అర్థమవుతూ ఉంది. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ బలం ఏంటో తెలిసిన తర్వాత అధినేత చంద్రబాబు మాటను కాదనలేక, స్థానికంగా పట్టు కోల్పోతున్న వాస్తవాన్ని ఒప్పుకోలేక జనంలోకి వెళ్లారు చాలామంది నేతలు. ఆ క్రమంలో వారి ఫ్రస్టేషన్ ఒక్కోసారి పీక్స్ […]

ఫ్రస్టేషన్.. ఫ్రస్టేషన్.. ఫ్రస్టేషన్..
X

మొన్న ఫొటోగ్రాఫర్ కి బాలకృష్ణ చెంపదెబ్బ, నిన్న మహిళా కార్యకర్తకి అశోక్ గజపతిరాజు చేతి దెబ్బ, నేడు జేసీ ప్రభాకర్ రెడ్డి తన సొంత అనుచరుడిపై వీరంగం.. ఇవన్నీ చూస్తుంటే టీడీపీ నేతలు ఎంత ఫ్రస్టేషన్లో ఉన్నారో అర్థమవుతూ ఉంది. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ బలం ఏంటో తెలిసిన తర్వాత అధినేత చంద్రబాబు మాటను కాదనలేక, స్థానికంగా పట్టు కోల్పోతున్న వాస్తవాన్ని ఒప్పుకోలేక జనంలోకి వెళ్లారు చాలామంది నేతలు. ఆ క్రమంలో వారి ఫ్రస్టేషన్ ఒక్కోసారి పీక్స్ కి వెళ్లిపోయింది. ఆ దశలోనే ఇలాంటి చెంపదెబ్బలు, చేతి దెబ్బలు. వరుసగా టీడీపీ నేతలు ఇలా సహనం కోల్పోయి పత్రికల్లో పతాక శీర్షికలకి ఎక్కడం పరిపాటిగా మారింది.

ఆద్యుడు చంద్రబాబేనా..?
మీకు సిగ్గులేదా, మీకు బుద్ధిలేదా, మీ చావు మీరు చావండి.. అంటూ ఇటీవల కాలంలో చంద్రబాబు కూడా తన ఎన్నికల ప్రచారంలో ప్రజల్ని సహనం కోల్పోయి తిట్టేసిన సందర్భాలున్నాయి. పౌరుషంలేదా, ఆమాత్రం మానం మర్యాద లేవా, ఎంతసేపు నేనే మీ తరపున పోరాడాలా, మీరు చేవ చచ్చిపోయారా అంటూ చంద్రబాబు వదిలిన వాగ్భాణాలు చాలామంది ప్రజల్ని గాయపరిచాయి. అయితే కార్యకర్తలెవరూ అప్పటికప్పుడు సమాధానం ఇవ్వలేకపోయినా, ఎన్నికల్లో తమ ఫ్రస్టేషన్ నూటికి నారు పాళ్లు చూపిస్తారనడంలో సందేహం లేదు.

చరిత్రలో ఎప్పుడూలేని ఘోర పరాభవం టీడీపీకి ఎదురు కావడంతోనే చంద్రబాబు సగం డీలా పడ్డారు. ఆ తర్వాత రాష్ట్రంలో నవరత్నాల పథకాలతో జగన్ పరపతి పెరగడం, స్థానిక ఎన్నికల్లో జరుగుతున్న ఏకగ్రీవాలు.. ఇలా అన్నీ చంద్రబాబుకి తలనొప్పిగా మారాయి. నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారడం, మరో ఇద్దరు మారితే తన ప్రతిపక్ష నేత హోదా కూడా రద్దయ్యే అవకాశం ఉండటం, ఉన్న వాళ్లలోనే కుమ్ములాటలు.. ఇవన్నీ కలిసి బాబుని మరింత కుంగదీశాయి. చేతికి అందిరాని కొడుకు కూడా భారంగా మారాడు. ఈ దశలో చంద్రబాబు ప్రజలపై తన అసహనాన్ని, కోపాన్ని చూపెడుతున్నారు.

చంద్రబాబు తరహాలోనే మిగిలిన నాయకులు కూడా సహనం కోల్పోయి చేతికి పని చెబుతున్నారు. సొంత కార్యకర్తలపైనే చేయి చేసుకోవడం ఈ వ్యవహారానికి పరాకాష్ట అనే చెప్పాలి. నాయకులంతా ఒక్కొక్కరే చేయి చేసుకోవడం, ఆ తర్వాత వారి చేయి తగలడం తమ అదృష్టం అంటూ కార్యకర్తలతో వివరణ ఇప్పించడం.. ఇదంతా మరీ ఓవర్ యాక్షన్ అనిపించకమానదు. గతంలో కూడా పలువురు నాయకులు ఇలా అదుపు తప్పి ప్రవర్తించిన సందర్భాలున్నా.. ఇప్పుడు రోజుల వ్యవధిలోనే ఒకే పార్టీకి చెందిన నాయకులు కట్టుతప్పి జనంపై పడటం మాత్రం కాస్త ఆలోచించాల్సిన విషయమే.

First Published:  10 March 2021 4:42 AM IST
Next Story