Telugu Global
Cinema & Entertainment

ఫైట్స్ లేని యాక్షన్ మూవీ వస్తోంది

యాక్షన్ సినిమా అంటే అందులో కచ్చితంగా ఫైట్స్ ఉంటాయి. ఛేజింగ్ సీన్లు బోనస్. మరి ఫైట్స్ లేకుండా యాక్షన్ సినిమా చేయొచ్చా? చేయొచ్చంటున్నాడు హీరో శ్రీవిష్ణు. అంతేకాదు.. చేసి చూపిస్తానని కూడా చెబుతున్నాడు. అవును.. త్వరలోనే ఓ యాక్షన్ సినిమా చేయబోతున్నాడు ఈ హీరో. కానీ అందులో ఫైట్స్ ఉండవట. తన అప్ కమింగ్ సినిమాల గురించి మాట్లాడుతూ.. ఈ విషయాన్ని బయటపెట్టాడు. “కొత్త దర్శకుడితో ఓ పోలీసాఫీసర్ బయోపిక్ చేస్తున్నాను. ఇదొక ఫిక్షనల్ బయోపిక్. నిజానికి […]

ఫైట్స్ లేని యాక్షన్ మూవీ వస్తోంది
X

యాక్షన్ సినిమా అంటే అందులో కచ్చితంగా ఫైట్స్ ఉంటాయి. ఛేజింగ్ సీన్లు బోనస్. మరి ఫైట్స్
లేకుండా యాక్షన్ సినిమా చేయొచ్చా? చేయొచ్చంటున్నాడు హీరో శ్రీవిష్ణు. అంతేకాదు.. చేసి చూపిస్తానని
కూడా చెబుతున్నాడు. అవును.. త్వరలోనే ఓ యాక్షన్ సినిమా చేయబోతున్నాడు ఈ హీరో. కానీ అందులో
ఫైట్స్ ఉండవట. తన అప్ కమింగ్ సినిమాల గురించి మాట్లాడుతూ.. ఈ విషయాన్ని బయటపెట్టాడు.

“కొత్త దర్శకుడితో ఓ పోలీసాఫీసర్ బయోపిక్ చేస్తున్నాను. ఇదొక ఫిక్షనల్ బయోపిక్. నిజానికి ఒక
పోలీసాఫీసర్ ది కాదు. ఐదుగురు పోలీసుల జీవితాల్లో జరిగిన యాదార్థ ఘటనల్ని బేస్ చేసుకొని ఓ
ఫిక్షనల్ బయోపిక్ చేస్తున్నాం. కంప్లీట్ యాక్షన్ మూవీ ఇది. కానీ ఎక్కడా ఫైట్స్ ఉండవు.”

శ్రీవిష్ణు అంటేనే డిఫరెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. అదే పంథాలో ఈ బయోపిక్ ను డిఫరెంట్ గా ప్లాన్
చేశాడు ఈ హీరో. మొత్తమ్మీద ఈ సినిమాతో తొలిసారిగా పోలీస్ గా కనిపించబోతున్నాడు శ్రీవిష్ణు. అతడు
నటించిన గాలిసంపత్ సినిమా రేపు రిలీజ్ కాబోతోంది.

First Published:  10 March 2021 11:14 AM IST
Next Story