Telugu Global
Others

సమ్మర్‌‌లో గార్డెనింగ్ ఇలా..

ఇంట్లో అందంగా పెంచుకునే ఇండోర్ మొక్కలు, గార్డెన్‌లో పెరిగే మొక్కలు ఇవన్నీ వేసవిరాగానే మెల్లగా ఎండిపోయే ప్రమాదముంది. అందుకే ఈ టైంలో వాటిని మరింత జాగ్రత్తగా పెంచాలి. తగినంత కేర్ తీసుకుంటూ వాటిని కాపాడుకుంటే ఇంటి వాతావరణాన్ని చల్లబరచుకోవచ్చు. మిగతా కాలాల కంటే వేసవిలో మొక్కల పెరుగుదలలో తేడాలుంటాయి. కొన్ని మొక్కలు వేసవిలో బాగా పెరిగితే.. కొన్ని మొక్కలు ఆకులు రాలి, కొత్తగా చిగురిస్తుంటాయి. మరికొన్ని మొక్కలు పూర్తిగా ఎండిపోతుంటాయి. అందుకే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. సరైన కుండీతో.. […]

సమ్మర్‌‌లో గార్డెనింగ్ ఇలా..
X

ఇంట్లో అందంగా పెంచుకునే ఇండోర్ మొక్కలు, గార్డెన్‌లో పెరిగే మొక్కలు ఇవన్నీ వేసవిరాగానే మెల్లగా ఎండిపోయే ప్రమాదముంది. అందుకే ఈ టైంలో వాటిని మరింత జాగ్రత్తగా పెంచాలి. తగినంత కేర్ తీసుకుంటూ వాటిని కాపాడుకుంటే ఇంటి వాతావరణాన్ని చల్లబరచుకోవచ్చు. మిగతా కాలాల కంటే వేసవిలో మొక్కల పెరుగుదలలో తేడాలుంటాయి. కొన్ని మొక్కలు వేసవిలో బాగా పెరిగితే.. కొన్ని మొక్కలు ఆకులు రాలి, కొత్తగా చిగురిస్తుంటాయి. మరికొన్ని మొక్కలు పూర్తిగా ఎండిపోతుంటాయి. అందుకే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

సరైన కుండీతో..
ఇండోర్ ప్లాంట్స్.. వాటి కుండీ సైజును బట్టి పెరుగుతాయి. కుండీకి రంధ్రాలు ఉన్నా.. మట్టి, నీళ్లు లీక్ అవ్వడం లాంటి ఇబ్బందులున్నా.. మొక్క పెరగడం కష్టంగా ఉంటుంది. అలాగే మొక్కలు పెరిగే కొద్ది వాటి వేర్లు విస్తరిస్తుంటాయి. కాబట్టి మొక్కల సైజును బట్టి చిన్న కుండీల నుంచి పెద్ద కుండీల్లోకి మొక్కల్ని మారుస్తూ ఉండడం మంచిది.

హైడ్రేషన్ ఇలా
ఎండా కాలంలో మొక్కలకు తగినంత నీరు అవసరం. నీరు తక్కువైనా, ఎక్కువైనా ఇబ్బందే. అందుకే మొక్కకు హైడ్రేషన్ సరిపడినంతగా ఉండాలి. ఈ కాలంలో మొక్కలకు ఎన్ని నీళ్లు అవసరం అన్నది కుండీలోని మట్టిని బట్టి చెప్పొచ్చు. ఒకసారి తాకగానే ఎండినట్లు కనిపిస్తే వెంటనే నీటిని పోయాలి.

సూర్యరశ్మి తాకకుండా..
ఇంట్లో ఉండే ఇండోర్ ప్లాంట్స్‌కు నేరుగా సూర్యరశ్మి సోకకుండా నీడలోఉంచాలి. అప్పుడే అవి ఎండిపోకుండా ఉంటాయి. ఇండోర్ ప్లాంట్స్‌ను రూం టెంపరేచర్ లో ఉంచి, గార్డెన్ మొక్కలకు మాత్రం కాస్త ఎండ తగిలేలా చూడాలి.

ఇవి కూడా..
కుండీలో ఏర్పాటు చేసే మొక్కలకు చెదలు, పురుగుల లాంటివిపట్టకుండా ముందు జాగ్రత్తగా వేప నూనె, కంపోస్ట్ లాంటివి నీటిలో కలిపి పిచికారి చేస్తే మంచిది. అలాగే మొక్క ఆరోగ్యం కోసం వాడే గుడ్డు పెంకు, అరటితొక్కలు లాంటి నేచురల్ పెస్టిసైడ్స్‌ను, న్యూట్రియెంట్స్‌ను వారానికొకసారైనా మొక్కకు పెడుతుండాలి. అలాగే వేసవిలో మొక్కలను ట్రిమ్ చేయడం, ఎండిన ఆకులను, కొమ్మలను తొలగించడం వంటివి తప్పకుండా చేయాలి.

గార్డెన్ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఉన్న ప్రతి మొక్క గురించి ఎంతోకొంత తెలిసి ఉండాలి. మొక్క ఏయే కాలాల్లో ఎలా పెరుగుతుంది, ఎలాంటి ఎరువులు అవసరం, నీరు ఎంత అవసరం లాంటి వివరాలు తెలుసుకుని దానికి తగ్గట్టు జాగ్రత్తలు తీసుకోవాలి.

First Published:  10 March 2021 7:12 AM IST
Next Story