Telugu Global
Cinema & Entertainment

అందుకే ఖమ్మంలో ఫంక్షన్ పెట్టారు

శర్వానంద్ హీరోగా నటిస్తున్న సినిమా శ్రీకారం. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను ఖమ్మంలో ఏర్పాటుచేశారు. కేవలం శర్వానంద్ పై ఇష్టంతో చిరంజీవి, అంత దూరం వెళ్లి ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో పాల్గొన్నారని అంతా అనుకున్నారు. కానీ అక్కడ జరిగింది వేరే. ఖమ్మంతో పెట్టిన ఫంక్షన్ కోసం చిరంజీవి వెళ్లలేదు. చిరంజీవి ఖమ్మంలో ఉన్నారు కాబట్టి ఫంక్షన్ అక్కడ పెట్టారు. అవును.. ఆచార్య షూటింగ్ కోసం కొన్ని రోజులుగా ఖమ్మంలో ఉంటున్నారు చిరంజీవి. సో.. చిరంజీవిని చీఫ్ […]

అందుకే ఖమ్మంలో ఫంక్షన్ పెట్టారు
X

శర్వానంద్ హీరోగా నటిస్తున్న సినిమా శ్రీకారం. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను ఖమ్మంలో
ఏర్పాటుచేశారు. కేవలం శర్వానంద్ పై ఇష్టంతో చిరంజీవి, అంత దూరం వెళ్లి ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో
పాల్గొన్నారని అంతా అనుకున్నారు. కానీ అక్కడ జరిగింది వేరే.

ఖమ్మంతో పెట్టిన ఫంక్షన్ కోసం చిరంజీవి వెళ్లలేదు. చిరంజీవి ఖమ్మంలో ఉన్నారు కాబట్టి ఫంక్షన్ అక్కడ
పెట్టారు. అవును.. ఆచార్య షూటింగ్ కోసం కొన్ని రోజులుగా ఖమ్మంలో ఉంటున్నారు చిరంజీవి. సో..
చిరంజీవిని చీఫ్ గెస్ట్ గా పిలవడం కోసం ఏకంగా తమ వేదికను ఖమ్మంకు మార్చేసింది శ్రీకారం యూనిట్.

అలా ఖమ్మం వేదికగా శ్రీకారం ఫంక్షన్ జరిగింది. ఈ విషయాన్ని చిరంజీవి నిండు సభలో బయటపెట్టారు.
తన కోసం ఏకంగా హైదరాబాద్ నుంచి ఖమ్మంకు వేదికను మార్చడం ఆనందంగా, ఆశ్చర్యంగా
ఉందన్నారు చిరంజీవి.

శ్రీకారం సినిమాకు సంబంధించి మరో ఫంక్షన్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. ఈ ఫంక్షన్ కు తెలంగాణ
మంత్రి కేటీఆర్ ప్రత్యేక అతిథిగా హాజరుకాబోతున్నారు.

First Published:  9 March 2021 2:51 AM IST
Next Story