Telugu Global
Cinema & Entertainment

కార్తికేయ-2 షూటింగ్ అప్ డేట్స్

సైలెంట్ గా మరో సినిమా స్టార్ట్ చేశాడు హీరో నిఖిల్. అది కూడా తనకు ఎంతో ప్రతిష్టాత్మకమైన కార్తికేయ-2 కావడం విశేషం. కార్తికేయ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈ హీరో, ఆ సినిమా సీక్వెల్ ను తిరుపతిలో కొన్ని రోజుల కిందట ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడా మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. గుజరాత్ లోని కొన్ని లొకేషన్లలో కార్తికేయ-2 షూటింగ్ మొదలైంది. దాదాపు 20 రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగుతోంది. ప్రస్తుతం నడుస్తున్న […]

కార్తికేయ-2 షూటింగ్ అప్ డేట్స్
X

సైలెంట్ గా మరో సినిమా స్టార్ట్ చేశాడు హీరో నిఖిల్. అది కూడా తనకు ఎంతో ప్రతిష్టాత్మకమైన కార్తికేయ-2
కావడం విశేషం. కార్తికేయ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈ హీరో, ఆ సినిమా సీక్వెల్ ను
తిరుపతిలో కొన్ని రోజుల కిందట ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడా మూవీ రెగ్యులర్ షూటింగ్
మొదలైంది.

గుజరాత్ లోని కొన్ని లొకేషన్లలో కార్తికేయ-2 షూటింగ్ మొదలైంది. దాదాపు 20 రోజుల పాటు ఈ షెడ్యూల్
కొనసాగుతోంది. ప్రస్తుతం నడుస్తున్న షెడ్యూల్ లో హీరో నిఖిల్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పై
కొన్ని సీన్స్ తీస్తున్నారు.

చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఓ
కీలక పాత్ర పోషించబోతున్నాడు. ఈ విషయాన్ని మేకర్స్ కొన్ని రోజుల కిందట అధికారికంగా
వెల్లడించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై TG విశ్వ ప్రసాద్ , అభిషేక్
అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. కాలభైరవ ఈ
సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

First Published:  9 March 2021 2:54 AM IST
Next Story