Telugu Global
NEWS

వార్డు వలంటీర్ల ఫోన్లపై నిషేధం..

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పంతం నెగ్గించుకున్నారు. మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యే వరకు వార్డు వలంటీర్ల ఫోన్లు స్వాధీనం చేసుకునేలా హైకోర్టు తాజాగా ఉత్తర్వులిచ్చింది. మున్సిపల్ ఎన్నికలు జరిగే వరకు వార్డు వలంటీర్లను విధులకు దూరం చేయాలని, వారి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవాలని గతంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆంక్షలు విధించినా.. హైకోర్టు ఉత్తర్వులతో అవి రద్దయ్యాయి. అయితే సింగిల్ జ‌డ్జి ఇచ్చిన ఉత్తర్వుల్ని హైకోర్టు ధర్మాసనం ఇప్పుడు సవరించింది. వలంటీర్ల ఫోన్ల వాడకంపై నిమ్మగడ్డ […]

వార్డు వలంటీర్ల ఫోన్లపై నిషేధం..
X

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పంతం నెగ్గించుకున్నారు. మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యే వరకు వార్డు వలంటీర్ల ఫోన్లు స్వాధీనం చేసుకునేలా హైకోర్టు తాజాగా ఉత్తర్వులిచ్చింది. మున్సిపల్ ఎన్నికలు జరిగే వరకు వార్డు వలంటీర్లను విధులకు దూరం చేయాలని, వారి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవాలని గతంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆంక్షలు విధించినా.. హైకోర్టు ఉత్తర్వులతో అవి రద్దయ్యాయి. అయితే సింగిల్ జ‌డ్జి ఇచ్చిన ఉత్తర్వుల్ని హైకోర్టు ధర్మాసనం ఇప్పుడు సవరించింది. వలంటీర్ల ఫోన్ల వాడకంపై నిమ్మగడ్డ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో.. హైకోర్టు అత్యవసరంగా విచారణ జరిపి వలంటీర్ల ఫోన్లపై ఆంక్షలు విధించింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు వార్డు వలంటీర్లు తమ ఫోన్లను మున్సిపల్ కమిషనర్ సూచించిన ఓ అధికారి వద్ద జమ చేయాలని, అవసరం అనుకుంటే వారి సమక్షంలోనే వాటిని వాడాలని సూచించింది.

పంచాయతీ ఎన్నికల సందర్భంగా వలంటీర్ల తీరుపై భారీగా ఫిర్యాదులు అందాయని ఎస్ఈసీ తరపు న్యాయవాది కోర్టుకి విన్నవించారు. వలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లలో వివిధ పథకాల లబ్ధిదారుల డేటా మొత్తం ఉంటుందని, ఆ డేటాను ఉపయోగించి ఓటర్లను, వలంటీర్లు ప్రభావితం చేసే అవకాశముంటుందని చెప్పారు. మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలో ఉన్న 68,913 మంది వలంటీర్లు సెల్ ఫోన్లలోని డేటాను దుర్వినియోగం చేయకుండా ఉంచేందుకు ఫోన్లను అప్పగించేలా ఆదేశించాలని కోర్టుని కోరారు. వీరి వాదనలు విన్న ధర్మాసనం సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. మున్సిపల్‌ కమిషనర్లు నామినేట్‌ చేసిన అధికారుల వద్ద వలంటీర్ల ఫోన్లు ఉంచాలని, అవసరమైనప్పుడు వారి సమక్షంలోనే వాటిని వాడాలని, అంతేకానీ.. పూర్తిగా అడ్డుకోవడం సరికాదని చెప్పింది.

ఫోన్లు తీసేసుకుంటే ఫలితాలు మారిపోతాయా..?
అయితే వలంటీర్ల ఫోన్లు తీసేసుకోవాలంటూ ఎస్ఈసీ పట్టుబట్టడాన్ని వైసీపీ నేతలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. కేవలం ఫోన్లు తీసేసుకున్నంత మాత్రాన ఫలితాలు తారుమారైపోతాయా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రజా బలం వల్లే పంచాయతీ ఎన్నికల్లో గెలిచామని, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలే తమ విజయానికి కారణం అవుతాయని అంటున్నారు. వలంటీర్ల ఫోన్లు తీసేసుకుంటే, ప్రజలు వైసీపీకి ఓట్లు వేయరనుకోవడం సరికాదని అంటున్నారు.

First Published:  6 March 2021 4:18 AM IST
Next Story