నితిన్ తో కలిసిన తమన్నా
కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తమన్న… ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అయింది. ఇప్పటికే ఎఫ్3 మూవీకి సంబంధించి చాలా భాగం పూర్తిచేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు ఫ్రెష్ గా నితిన్ సినిమా స్టార్ట్ చేసింది. హిందీలో సూపర్ హిట్టయిన అంధాధున్ సినిమాను నితిన్ తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. హిందీలో టబు పోషించిన నెగెటివ్ రోల్ ను తెలుగులో తమన్న పోషించడానికి […]
కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తమన్న… ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అయింది. ఇప్పటికే ఎఫ్3
మూవీకి సంబంధించి చాలా భాగం పూర్తిచేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు ఫ్రెష్ గా నితిన్ సినిమా స్టార్ట్
చేసింది.
హిందీలో సూపర్ హిట్టయిన అంధాధున్ సినిమాను నితిన్ తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. మేర్లపాక గాంధీ
దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. హిందీలో టబు పోషించిన
నెగెటివ్ రోల్ ను తెలుగులో తమన్న పోషించడానికి అంగీకరించింది. ఇప్పుడా పాత్రకు సంబంధించిన
షూటింగ్ స్టార్ట్ చేశారు.
ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమాలో నితిన్ అంధుడిగా కనిపించబోతున్నాడు. సినిమాపై నమ్మకంతో
తన సొంత బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు నితిన్.