Telugu Global
Cinema & Entertainment

చేతులు మారిన టక్ జగదీష్

నాని సినిమాల బాక్సాఫీస్ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ.. బుల్లితెరపై మాత్రం అతడికి మంచి క్రేజ్ ఉంది. సిల్వర్ స్క్రీన్ పై ఫ్లాప్ అయిన సినిమాలు కూడా బుల్లితెరపై హిట్ అయిన దాఖలాలున్నాయి. అందుకే అతడి సినిమాల్ని దక్కించుకునేందుకు ఎంటర్ టైన్ మెంట్ ఛానెళ్లు పోటీపడుతుంటాయి. ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న నాని సినిమాను ఓ ఛానెల్ వదులుకుంది. మరో ఛానెల్ దక్కించుకుంది. నాని లేటెస్ట్ మూవీ టక్ జగదీష్. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై […]

చేతులు మారిన టక్ జగదీష్
X

నాని సినిమాల బాక్సాఫీస్ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ.. బుల్లితెరపై మాత్రం అతడికి మంచి క్రేజ్ ఉంది.
సిల్వర్ స్క్రీన్ పై ఫ్లాప్ అయిన సినిమాలు కూడా బుల్లితెరపై హిట్ అయిన దాఖలాలున్నాయి. అందుకే
అతడి సినిమాల్ని దక్కించుకునేందుకు ఎంటర్ టైన్ మెంట్ ఛానెళ్లు పోటీపడుతుంటాయి. ఇలాంటి
ట్రాక్ రికార్డ్ ఉన్న నాని సినిమాను ఓ ఛానెల్ వదులుకుంది. మరో ఛానెల్ దక్కించుకుంది.

నాని లేటెస్ట్ మూవీ టక్ జగదీష్. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ
అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే భారీ రేటుకు జెమినీ ఛానెల్ ఈ సినిమా రైట్స్
దక్కించుకుంది. అయితే ఏమైందో ఏమో ఆఖరి నిమిషంలో ఈ ప్రాజెక్టు నుంచి జెమినీ తప్పుకుంది. అలా
జెమినీ తప్పుకోవడమే ఆలస్యం, స్టార్ మా ఛానెల్ ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను దక్కించుకుంది.

నాని, రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు ఓ కీలక పాత్ర
పోషిస్తున్నాడు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు పక్కా యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో ఉన్నాయి.
వచ్చే నెల ఈ సినిమా విడుదలకాబోతోంది.

First Published:  6 March 2021 12:11 PM IST
Next Story