వారానికే ఓటీటీకొచ్చిన సినిమా
థియేటర్లలో రిలీజైన తర్వాత 4 వారాల వరకు ఓటీటీకి ఏ సినిమాను ఇవ్వకూడదనే నిబంధన ఉండనే ఉంది. ఓవైపు ఈ రూల్ ఉన్నప్పటికీ, మరోవైపు మేకర్స్ మాత్రం తమ సినిమాల్ని వారం రోజులు, 10 రోజులకే ఓటీటీలకు ఇచ్చేస్తున్నారు. నిబంధనల్ని తుంగలో తొక్కేస్తున్నారు. ఇప్పుడీ జాబితాలోకి అక్షర అనే సినిమా కూడా చేరిపోయింది. మొన్ననే రిలీజైన ఈ సినిమా సెడన్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ప్రత్యక్షమైంది. ఇంకా చెప్పాలంటే విడుదలైన 8వ రోజుకే ఈ […]
థియేటర్లలో రిలీజైన తర్వాత 4 వారాల వరకు ఓటీటీకి ఏ సినిమాను ఇవ్వకూడదనే నిబంధన ఉండనే
ఉంది. ఓవైపు ఈ రూల్ ఉన్నప్పటికీ, మరోవైపు మేకర్స్ మాత్రం తమ సినిమాల్ని వారం రోజులు, 10
రోజులకే ఓటీటీలకు ఇచ్చేస్తున్నారు. నిబంధనల్ని తుంగలో తొక్కేస్తున్నారు. ఇప్పుడీ జాబితాలోకి అక్షర
అనే సినిమా కూడా చేరిపోయింది.
మొన్ననే రిలీజైన ఈ సినిమా సెడన్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ప్రత్యక్షమైంది. ఇంకా చెప్పాలంటే
విడుదలైన 8వ రోజుకే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. దీనిపై కొంతమంది ఇండస్ట్రీ పెద్దలు అసహనం
వ్యక్తం చేస్తున్నప్పటికీ, నిర్మాతల వెర్షన్ మాత్రం మరోలా ఉంది.
గట్టి పోటీ మధ్య విడుదలైన అక్షర సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు దొరకలేదు. దొరికిన కొద్దిపాటి
థియేటర్లలో కూడా ఓపెనింగ్స్ రాలేదు. అలాంటి సినిమాను ఇంకొన్నాళ్లు తమ వద్ద ఉంచుకునే బదులు,
ఒకేసారి ఓటీటీకి ఇచ్చేయడం మంచిదని నిర్మాతలు భావించారు. అలా ఆర్థిక నష్టం నుంచి కొంతైనా
బయటపడొచ్చనేది నిర్మాతల ఆలోచన. ఈ విషయంలో ఎవ్వర్నీ తప్పుబట్టలేం.