మండలిలో టీడీపీ చెత్త రాజకీయాలకు చరమగీతం -సజ్జల..
అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న టీడీపీ మండలిలో ఉన్న మందబలాన్ని ఆసరాగా చేసుకొని, ఇన్నాళ్లూ సాంకేతిక కారణాలు చూపి రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగించే పనులు చేస్తోందని మండిపడ్డారు ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులతో కలసి మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇకపై మండలిలో టీడీపీ చెత్త రాజకీయాలకు చరమగీతం పాడుతున్నామని చెప్పారు. వచ్చే మే నెల నాటికి కౌన్సిల్ లో వైసీపీకి పూర్తి మెజార్టీ వస్తుందని, ఆ తర్వాత […]
అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న టీడీపీ మండలిలో ఉన్న మందబలాన్ని ఆసరాగా చేసుకొని, ఇన్నాళ్లూ సాంకేతిక కారణాలు చూపి రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగించే పనులు చేస్తోందని మండిపడ్డారు ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులతో కలసి మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇకపై మండలిలో టీడీపీ చెత్త రాజకీయాలకు చరమగీతం పాడుతున్నామని చెప్పారు. వచ్చే మే నెల నాటికి కౌన్సిల్ లో వైసీపీకి పూర్తి మెజార్టీ వస్తుందని, ఆ తర్వాత రాష్ట్రాభివృద్ధికోసం సీఎం జగన్ తీసుకునే నిర్ణయాలకు ఉభయ సభలూ మద్దతు తెలుపుతాయని చెప్పారు. మండలి కూడా మద్దతిస్తే.. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకుంటాయని అన్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో అన్ని వర్గాలకు సీఎం జగన్ ప్రాధాన్యత ఇచ్చారని స్పష్టం చేశారు సజ్జల.
వైసీపీలో వెనుకబడిన వర్గాలకు సముచిత ప్రాధాన్యం దక్కుతుందని, పార్టీ కోసం ముందు నిలబడి పనిచేసిన వారిని గుర్తింపు కచ్చితంగా లభిస్తుందని చెప్పారు. పార్టీకోసం నిలబడినవారిని గుర్తించడం వల్లే, వైసీపీలో ఎక్కడా చిన్నపాటి సమస్య కూడా ఉండదని చెప్పారు. కష్టపడి పనిచేసేవారికి వైసీపీలో మాత్రమే గుర్తింపు ఉంటుందనే విషయం అందరికీ తెలుసని అన్నారు. అందుకే మిగిలిన పార్టీల్లో లాగా.. పదవుల విషయంలో ఊహాగానాలు, అసంతృప్తులు వంటివి వైసీపీలో కనిపించవని చెప్పారు. జగన్ నాయకత్వ ప్రతిభకు, సమన్యాయం అందించటంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు ఇదే ఉదాహరణ అని అన్నారు. ఎమ్మల్సీ అభ్యర్థులుగా వైసీపీ తరపున నామినేషన్ వేసిన ఇక్బాల్, కరీమున్సీసా, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, చల్లా భగీరథ, దువ్వాడ శ్రీనివాస్, సి.రామచంద్రయ్యకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.