Telugu Global
National

దేశంలో బెస్ట్ సిటీస్ ఇవే..

ఉన్నత జీవన ప్రమాణాలతో.. హాయిగా జీవించేందుకు అనువైన నగరాల లిస్ట్‌ను కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 111 నగరాలతో రూపొందించిన ‘ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌-2020’ జాబితాలో బెంగళూరు ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. హైదరాబాద్ 24వ స్థానానికి పడిపోయింది. ఏయే నగరాలు ఏయే ర్యాకింగ్స్ లో ఉన్నాయంటే.. ఈ జాబితా రెండు కేటగిరీలుగా విడుదలైంది. పది లక్షలకు పైగా జనాభా ఉండే నగరాలు, పది లక్షల లోపు జనాభా ఉండే నగరాలుగా వర్గీకరించి, ఈజ్ ఆఫ్ […]

దేశంలో బెస్ట్ సిటీస్ ఇవే..
X

ఉన్నత జీవన ప్రమాణాలతో.. హాయిగా జీవించేందుకు అనువైన నగరాల లిస్ట్‌ను కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 111 నగరాలతో రూపొందించిన ‘ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌-2020’ జాబితాలో బెంగళూరు ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. హైదరాబాద్ 24వ స్థానానికి పడిపోయింది. ఏయే నగరాలు ఏయే ర్యాకింగ్స్ లో ఉన్నాయంటే..

ఈ జాబితా రెండు కేటగిరీలుగా విడుదలైంది. పది లక్షలకు పైగా జనాభా ఉండే నగరాలు, పది లక్షల లోపు జనాభా ఉండే నగరాలుగా వర్గీకరించి, ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ను ప్రకటించారు. నగరాల్లో ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక సామర్థ్యం ఆధారంగా ఈజ్ ఆఫ్ లివిండ్ ఇండెక్స్‌ను రూపొందించారు.10 లక్షలకుపైగా జనాభా ఉండే నగరాల జాబితాలో.. నివాసయోగ్యానికి అత్యున్నత నగరంగా బెంగళూరు నిలిచింది. రెండో స్థానంలో పూణె, మూడవ స్థానంలో అహ్మదాబాద్, నాల్గవ స్థానంలో చెన్నై, ఐదవ స్థానంలో సూరత్ నగరాలు ఉన్నాయి. న‌వీ ముంబై, కోయంబ‌త్తూర్‌, వ‌డోద‌ర‌, ఇండోర్‌, గ్రేట‌ర్ ముంబై ఆ తర్వాత ర్యాంక్‌లు కైవసం చేసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ 13వ ర్యాంక్‌లో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో 15వ స్థానంలో వైజాగ్‌, 24 వ స్థానంలో హైదరాబాద్, 41వ స్థానంలో విజయవాడ ఉన్నాయి.

టాప్ 10 నగరాలు(10లక్షల పైన జనాభా)
1. బెంగళూరు
2. పుణె
3. అహ్మదాబాద్
4. చెన్నై
5. సూరత్
6. నవీ ముంబై
7. కోయంబత్తూరు
8. వడోదర
9. ఇండోర్
10. గ్రేటర్ ముంబై

టాప్ 10 నగరాలు(10లక్షల లోపు జనాభా)
1. సిమ్లా
2. భువనేశ్వర్
3. సిల్వసా
4. కాకినాడ
5. సేలం
6. వేలూరు
7. గాంధీనగర్
8. గురుగ్రామ్
9. దావణగెరె
10. తిరుచిరాపల్లి

ఇకపోతే వీటితో పాటు మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్‌ను కూడా కేంద్రం విడుదల చేసింది. అందులో ఇండోర్ మొదటి స్థానంలో ఉండగా.. సూరత్, భోపాల్, పింప్రి-చించ్వాడ్ నగరాలు వరుసగా 2, 3, 4 స్థానాల్లో నిలిచాయి. తెలుగు రాష్ట్రాల్లో వైజాగ్ 9వ స్థానంలో, హైదరాబాద్‌ 17, విజయవాడ 27వ స్థానాల్లో నిలిచాయి.

First Published:  5 March 2021 7:51 AM IST
Next Story