ఏపీలో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్..
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రమంతా ఏకతాటిపై నిలబడి బంద్ కి సంపూర్ణ మద్దతిచ్చింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా అనే బేధభావం లేకుండా అందరూ బంద్ లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆందోళనలు ఉత్తరాంధ్ర మినహా మిగతా చోట్ల ప్రభావం చూపించలేకపోయాయి. అయితే బంద్ కి మాత్రం రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ మద్దతు లభించింది. ఉక్కు ఉద్యమానికి రాష్ట్రవ్యాప్త మద్దతు ఉన్నట్టు తేలిపోయింది. స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి’ పిలుపునిచ్చిన […]
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రమంతా ఏకతాటిపై నిలబడి బంద్ కి సంపూర్ణ మద్దతిచ్చింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా అనే బేధభావం లేకుండా అందరూ బంద్ లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆందోళనలు ఉత్తరాంధ్ర మినహా మిగతా చోట్ల ప్రభావం చూపించలేకపోయాయి. అయితే బంద్ కి మాత్రం రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ మద్దతు లభించింది. ఉక్కు ఉద్యమానికి రాష్ట్రవ్యాప్త మద్దతు ఉన్నట్టు తేలిపోయింది.
స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి’ పిలుపునిచ్చిన బంద్ కి బీజేపీ మినహా ఇతర రాజకీయ పార్టీలన్నీ మద్దతు తెలిపాయి. ముఖ్యంగా వామపక్షాలు ముందుండి బంద్ ని నడిపిస్తున్నాయి. అటు అధికార వైసీపీ కూడా బంద్ కి సంపూర్ణ మద్దతివ్వడంతో ఎక్కడికక్కడ బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. మధ్యాహ్నం 1గంటనుంచి ఇతర అధికారిక కార్యక్రమాలు మొదలవుతాయి.
విశాఖ ఉక్కుకోసం మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నిరాహార దీక్ష చేసిన సమయంలో ఉన్న జోష్ ఇప్పుడు టీడీపీలో కనిపించండంలేదు. ఇక బీజేపీ అసలు బంద్ కి మద్దతివ్వకుండా పత్తా లేకుండా పోయింది. ఉద్యమం మొదలైన తొలినాళ్లలో.. కేంద్రంతో మాట్లాడి ప్రైవేటీకరణ అడ్డుకుంటామని సోము వీర్రాజు ప్రకటించినా, ఆ తర్వాత ఆయన మెల్లగా జారుకున్నారు. బీజేపీ రాష్ట్ర శాఖకు ఉక్కు ఉద్యమం విషయంలో ఓ విధానమంటూ లేదు. ఎవరికి వారు వ్యక్తిగత అజెండాతో మాత్రమే స్పందిస్తున్నారు. ఇక బీజేపీతో కలసి ఉండటం వల్ల జనసేన కూడా ఇరుకున పడింది. జనసైనికులు కూడా బంద్ లో పాల్గొనేందుకు ఆసక్తి చూపించలేదు. బంద్ కి మద్దతిచ్చారన్న పేరే కానీ, జనసేన జెండా ఎక్కడా కనపడలేదు. మొత్తమ్మీద వామపక్షాల ఆధ్వర్యంలో, వైసీపీ ప్రభుత్వ మద్దతుతో ఏపీలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.