ఈసారి పవన్ సినిమా నుంచి లీకులు
మొన్నటికిమొన్న ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి లీకులు చూశాం. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 6 స్టిల్స్ లీక్ అయి యూనిట్ ను ఉక్కిరిబిక్కిరి చేసింది. వాటిని సోషల్ మీడియా నుంచి తొలిగించడానికి 2 రోజులు పట్టింది. ఇప్పుడీ లీకుల బెడద పవన్ సినిమాకు పట్టుకుంది. సాగర్ చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ చేస్తున్నాడు పవన్. ఈ మూవీకి సంబంధించి తాజాగా పవన్ కు చెందిన స్టిల్స్ కొన్ని లీక్ అయ్యాయి. అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ […]
మొన్నటికిమొన్న ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి లీకులు చూశాం. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 6 స్టిల్స్ లీక్ అయి యూనిట్ ను ఉక్కిరిబిక్కిరి చేసింది. వాటిని సోషల్ మీడియా నుంచి తొలిగించడానికి 2 రోజులు పట్టింది. ఇప్పుడీ లీకుల బెడద పవన్ సినిమాకు పట్టుకుంది.
సాగర్ చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ చేస్తున్నాడు పవన్. ఈ మూవీకి సంబంధించి తాజాగా పవన్ కు చెందిన స్టిల్స్ కొన్ని లీక్ అయ్యాయి. అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లో పవన్ గెటప్ ఎలా ఉంటుందనే విషయం ఈ స్టిల్స్ తో తెలిసిపోయింది.
అయితే లీకుల విషయంలో పవన్ ఫ్యాన్స్ చాలా సీరియస్ గా ఉంటారు. తమ హీరో సినిమా నుంచి ఇలా లీకులు వచ్చాయని తెలిసిన గంటల వ్యవథిలోనే అలా రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియా నుంచి ఆ 3 ఫొటోల్ని వెంటనే తొలిగించారు. అయితే అప్పటికే అవి వైరల్ అయిపోయాయి. మొబైల్ వాల్ పేపర్స్ గా, వాట్సాప్ డీపీలుగా చేరిపోయాయి.