పుష్ప కోసం 10 టీజర్లు
అల వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వస్తున్న సినిమా పుష్ప. అందుకే ఈ సినిమాపై బన్నీ స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. సినిమాకు సంబంధించి ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. దశలవారీగా స్టిల్స్ రిలీజ్ చేస్తున్నాడు. రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశాడు. ఇందులో భాగంగా ఇప్పుడు కీలకమైన టీజర్ దశకు వచ్చింది పుష్ప యూనిట్. దీంతో బన్నీ ఇప్పుడు మరింత కేర్ తీసుకుంటున్నాడు. బన్నీ పుట్టినరోజు సందర్భంగా పుష్ప టీజర్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ […]
అల వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వస్తున్న సినిమా పుష్ప. అందుకే ఈ సినిమాపై బన్నీ స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. సినిమాకు సంబంధించి ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. దశలవారీగా స్టిల్స్ రిలీజ్ చేస్తున్నాడు. రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశాడు. ఇందులో భాగంగా ఇప్పుడు కీలకమైన టీజర్ దశకు వచ్చింది పుష్ప యూనిట్. దీంతో బన్నీ ఇప్పుడు మరింత కేర్ తీసుకుంటున్నాడు.
బన్నీ పుట్టినరోజు సందర్భంగా పుష్ప టీజర్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 10 టీజర్ కట్స్ రెడీ చేశారు. ముగ్గురు ఎడిటర్లు ఈ టీజర్లు తయారుచేశారు. ఈ 10 టీజర్ల నుంచి ఒక టీజర్ ను సెలక్ట్ చేసే బాధ్యతను బన్నీకి అప్పగించారు. ఎలాగూ అంతిమ నిర్ణయం అతడిదే కాబట్టి.. 10 టీజర్లను అతడికే పంపించారు.
అయితే బన్నీ మాత్రం తెలివిగా.. ఆ 10 లోంచి 4 టీజర్లను ఫైనల్ చేసే భాద్యతను సుకుమార్ కు అప్పగించాడు. అలా ఫైనల్ అయిన 4 నుంచి ఒకటి బన్నీ సెలక్ట్ చేస్తాడన్నమాట.
రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఆగస్ట్ 13న రిలీజ్ చేయబోతున్నారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.