Telugu Global
Cinema & Entertainment

ఆర్ఆర్ఆర్ లీకులు

ఊహించని విధంగా ఆర్ఆర్ఆర్ నుంచి మరోసారి లీకులు మొదలయ్యాయి. ఈసారి ఏకంగా 6 స్టిల్స్ లీక్ అయ్యాయి. వీటిలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కు సంబంధించిన ఫొటోలతో పాటు ఫారిన్ హీరోయిన్ స్టిల్స్ కూడా ఉన్నాయి. ఒక్కసారిగా ఇన్ని స్టిల్స్ లీక్ అవ్వడంతో యూనిట్ తలపట్టుకుంది. సినిమాలో పెద్దపులితో ఎన్టీఆర్ ఫైట్ చేసే సీక్వెన్స్ ఉంది. దీనికి సంబంధించిన వీడియో గతంలోనే లీక్ అయింది. ఇప్పుడు అదే వీడియో నుంచి స్టిల్ లీక్ అయింది. అటు బ్రిటిష్ […]

ఆర్ఆర్ఆర్ లీకులు
X

ఊహించని విధంగా ఆర్ఆర్ఆర్ నుంచి మరోసారి లీకులు మొదలయ్యాయి. ఈసారి ఏకంగా 6 స్టిల్స్ లీక్
అయ్యాయి. వీటిలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కు సంబంధించిన ఫొటోలతో పాటు ఫారిన్ హీరోయిన్ స్టిల్స్
కూడా ఉన్నాయి. ఒక్కసారిగా ఇన్ని స్టిల్స్ లీక్ అవ్వడంతో యూనిట్ తలపట్టుకుంది.

సినిమాలో పెద్దపులితో ఎన్టీఆర్ ఫైట్ చేసే సీక్వెన్స్ ఉంది. దీనికి సంబంధించిన వీడియో గతంలోనే లీక్
అయింది. ఇప్పుడు అదే వీడియో నుంచి స్టిల్ లీక్ అయింది. అటు బ్రిటిష్ పోలీస్ గెటప్ లో ఉన్న రామ్
చరణ్ స్టిల్, తారక్ ను అరెస్ట్ చేస్తుంటే హీరోయిన్ అడ్డుకుంటున్న స్టిల్స్, మంటల మధ్యలో ఎన్టీఆర్
వీరోచితంగా పోరాటం చేస్తున్న ఫొటో లీక్ అయ్యాయి.

లీకులు వచ్చిన వెంటనే ఆర్ఆర్ఆర్ యూనిట్ అప్రమత్తమైంది. వెంటనే సోషల్ మీడియా నుంచి వాటిని
తొలిగించే ప్రయత్నం చేసింది. అయితే అప్పటికే ఆ ఫొటోలు ఫేస్ బుక్, ట్విట్టర్ నుంచి వ్యక్తిగత వాట్సాప్
ఖాతాల్లోకి చేరిపోయాయి. వాటిని డిలీట్ చేయడం ఎవ్వరితరం కాదు.

First Published:  4 March 2021 1:11 PM IST
Next Story