జాతిరత్నాలు ట్రయిలర్ రివ్యూ
థియేటర్లలో కడుపుబ్బా నవ్వుకొని చాన్నాళ్లయింది. బంగారు బుల్లోడుగా వచ్చిన అల్లరోడు నవ్విస్తాడనుకుంటే విసిగించాడు. ఇప్పుడా లోటును మేం తీరుస్తామంటున్నారు జాతిరత్నాలు. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి నటించిన ఈ సినిమా ట్రయిలర్ ను ప్రభాస్ లాంఛ్ చేశాడు. ట్రయిలర్ నిండా కామెడీ సీన్లు, పంచ్ డైలాగులే. ఈ సినిమాలో శ్రీకాంత్ (నవీన్), శేఖర్ (ప్రియదర్శి), రవి (రాహుల్ రామకృష్ణ) ముగ్గురు ఫ్రెండ్స్ అని ఇదివరకు టీజర్ ద్వారానే మనం తెలుసుకున్నాం. శ్రీకాంత్‌కు ఓ లవ్ స్టోరీ […]
థియేటర్లలో కడుపుబ్బా నవ్వుకొని చాన్నాళ్లయింది. బంగారు బుల్లోడుగా వచ్చిన అల్లరోడు
నవ్విస్తాడనుకుంటే విసిగించాడు. ఇప్పుడా లోటును మేం తీరుస్తామంటున్నారు జాతిరత్నాలు. నవీన్
పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి నటించిన ఈ సినిమా ట్రయిలర్ ను ప్రభాస్ లాంఛ్ చేశాడు.
ట్రయిలర్ నిండా కామెడీ సీన్లు, పంచ్ డైలాగులే.
ఈ సినిమాలో శ్రీకాంత్ (నవీన్), శేఖర్ (ప్రియదర్శి), రవి (రాహుల్ రామకృష్ణ) ముగ్గురు ఫ్రెండ్స్ అని
ఇదివరకు టీజర్ ద్వారానే మనం తెలుసుకున్నాం. శ్రీకాంత్‌కు ఓ లవ్ స్టోరీ కూడా ఉంది. హీరోయిన్‌ను
పటాయించడానికి మనోడు ఎన్ని వేషాలు వేస్తాడో ట్రైలర్ చూపించింది. బీటెక్ చదివిన అతను ‘శ్రింగార్
లేడీస్ ఎంపోరియం’ నడుపుతుంటాడని మనం తెలుసుకుంటాం. ఎంతో జోవియల్‌గా ఉండే ఆ ముగ్గురు
ఫ్రెండ్స్ చంచల్‌గూడ జైలుకు ఖైదీలుగా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనేది ఆసక్తికరంగా, ఫుల్
ఎంటర్‌టైనింగ్‌గా డైరెక్టర్ చిత్రీకరించి ఉంటారని మనం ఊహించవచ్చు. జైలులో ఈ ముగ్గురు ఫ్రెండ్స్‌కి
వెన్నెల కిశోర్ కూడా తోడవుతాడు. ఇంక నవ్వులకు కొదవ ఉంటుందా!
జాతిరత్నాలు ట్రైలర్ రధన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సిద్దం మనోహర్ సినిమాటోగ్రఫీ ఇంప్రెసివ్‌గా ఉన్నాయి.
మార్చి 11న ‘జాతిరత్నాలు’ థియేటర్లలో విడుదలకు రెడీ అవుతోంది.ఈ చిత్రానికి అనుదీప్ కె.వి.
దర్శకుడు. స్వప్న సినిమా బ్యానర్‌పై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా
నటిస్తున్నారు.