Telugu Global
NEWS

12 కార్పొరేష‌న్ల‌లో ఫ్యాన్‌దే హ‌వా ! వైసీపీ ర‌హ‌స్య స‌ర్వే !

ఏపీ కార్పొరేషన్ ఎన్నిక‌ల్లో వైసీపీదే హ‌వా అని స‌ర్వేలో తేలింది. సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కోసం ర‌హ‌స్య స‌ర్వే నిర్వ‌హించారు. ఈ స‌ర్వేలో 12 కార్పొరేష‌న్లు వైసీపీ వశం అవుతాయ‌ని స్ప‌ష్ట‌మైంది. ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం టీడీపీ గ‌ట్టిపోటీ ఇస్తుంద‌ని తేలింది. విశాఖ‌, విజ‌య‌వాడ‌లోని కొన్ని డివిజ‌న్ల‌లో పోటీ ఉంద‌ని సీఎం జ‌గ‌న్ త‌న స‌హ‌చ‌ర మంత్రుల‌ను అల‌ర్ట్ చేశారు. విశాఖ‌, విజ‌య‌వాడ‌లో కూడా వైసీపీకి స్ప‌ష్ట‌మైన మెజార్టీ ఉంద‌ని సూచించింది. కానీ, గ్రేట‌ర్ విశాఖ‌ప‌ట్పంలో […]

12 కార్పొరేష‌న్ల‌లో ఫ్యాన్‌దే హ‌వా ! వైసీపీ ర‌హ‌స్య స‌ర్వే !
X

ఏపీ కార్పొరేషన్ ఎన్నిక‌ల్లో వైసీపీదే హ‌వా అని స‌ర్వేలో తేలింది. సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కోసం ర‌హ‌స్య స‌ర్వే నిర్వ‌హించారు. ఈ స‌ర్వేలో 12 కార్పొరేష‌న్లు వైసీపీ వశం అవుతాయ‌ని స్ప‌ష్ట‌మైంది.

ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం టీడీపీ గ‌ట్టిపోటీ ఇస్తుంద‌ని తేలింది. విశాఖ‌, విజ‌య‌వాడ‌లోని కొన్ని డివిజ‌న్ల‌లో పోటీ ఉంద‌ని సీఎం జ‌గ‌న్ త‌న స‌హ‌చ‌ర మంత్రుల‌ను అల‌ర్ట్ చేశారు. విశాఖ‌, విజ‌య‌వాడ‌లో కూడా వైసీపీకి స్ప‌ష్ట‌మైన మెజార్టీ ఉంద‌ని సూచించింది. కానీ, గ్రేట‌ర్ విశాఖ‌ప‌ట్పంలో 27 డివిజ‌న్ల‌లో, విజ‌య‌వాడ‌లో 14 డివిజ‌న్ల‌లో పోటా పోటీ ఉన్న‌ట్లు స‌ర్వేలో తేలింది. ఈ డివిజ‌న్ల‌పై ఫుల్‌‌గా ఫోక‌స్ పెట్టాల‌ని మంత్రుల‌ను సీఎం ఆదేశించారు.

ఈ ర‌హ‌స్య స‌ర్వే ప్ర‌కారం విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌వాడ‌, ఒంగోలు, విజ‌య‌న‌గ‌రంలో టీడీపీకి చెప్పుకోద‌గ్గ సీట్లు వ‌స్తాయ‌ని.. మిగ‌తా కార్పొరేష‌న్ల‌లో సింగిల్ డిజిట్‌కే ప‌రిమిత‌మ‌వుతుంద‌ని క్లారిటీ వ‌చ్చింది.

మున్సిప‌ల్ కార్పొరేష‌న్ మొత్తం డివిజ‌న్లు వైసీపీ టీడీపీ పోటాపోటీ
వైజాగ్ 98 50 20 27

విజ‌య‌వాడ 64 38 12 14

గుంటూరు 57 43 6 7

ఒంగోలు 50 35 7 8

తిరుప‌తి 50 39 5 6

క‌ర్నూలు 52 40 6 4

క‌డ‌ప 50 49 0 1

ఏలూరు 50 37 9 4

అనంత‌పురం 50 40 5 5

విజ‌య‌న‌గ‌రం 50 32 14 4

చిత్తూరు 50 45 2 2

First Published:  4 March 2021 12:23 PM IST
Next Story