దేవిశ్రీ కూడా ట్రెండ్ ఫాలో అవ్వక తప్పలేదు
ఇన్నాళ్లు మడికట్టుకొని కూర్చున్న దేవిశ్రీప్రసాద్ కూడా ఇప్పుడు ట్రెండ్ ఫాలో అవ్వక తప్పలేదు. అదే సిద్ శ్రీరామ్ ట్రెండ్. సినిమా ఏదైనా, హీరో ఎవరైనా, అందులో సిద్ శ్రీరామ్ పాట ఉండాల్సిందే. అతడి పాట సినిమాకు మొదటి ప్రచారాస్త్రంగా మారుతోంది. కేవలం సిద్ పాటలతో ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా పేరు చెప్పుకోవచ్చు. అయితే ఇన్నాళ్లూ ఈ సింగర్ కు దూరంగా […]
ఇన్నాళ్లు మడికట్టుకొని కూర్చున్న దేవిశ్రీప్రసాద్ కూడా ఇప్పుడు ట్రెండ్ ఫాలో అవ్వక తప్పలేదు. అదే
సిద్ శ్రీరామ్ ట్రెండ్. సినిమా ఏదైనా, హీరో ఎవరైనా, అందులో సిద్ శ్రీరామ్ పాట ఉండాల్సిందే. అతడి
పాట సినిమాకు మొదటి ప్రచారాస్త్రంగా మారుతోంది. కేవలం సిద్ పాటలతో ఓపెనింగ్స్ తెచ్చుకున్న
సినిమాలు కూడా ఉన్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా పేరు
చెప్పుకోవచ్చు.
అయితే ఇన్నాళ్లూ ఈ సింగర్ కు దూరంగా ఉన్నాడు దేవిశ్రీప్రసాద్. ఓ వైపు సిద్ తో కలిసి తమన్ మేజిక్స్
చేస్తున్నప్పటికీ.. డీఎస్పీ మాత్రం ఎందుకో సిద్ కు అవకాశం ఇవ్వలేదు. గాయకుడ్ని కాకుండా, తన
సొంత టాలెంట్ ను నమ్ముకున్నాడు. అలాంటి దేవిశ్రీప్రసాద్ కూడా ఇప్పుడు సిద్ వెంట పడాల్సి
వచ్చింది.
రంగ్ దే సినిమా కోసం తొలిసారిగా సిద్ శ్రీరామ్ తో పాట పాడించాడు దేవిశ్రీప్రసాద్. దీనికి సంబంధించి
చిన్న వీడియోను విడుదల చేశాడు కూడా. ఇక పాటను రేపు మహేష్ బాబు చేతుల మీదుగా లాంఛ్
చేయబోతున్నారు.
రంగ్ దే సినిమాకు ఈ పాటే ప్రధాన ఆయుధం కాబోతోందనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి దేవిశ్రీ-సిద్
కలిశారు. ఈసారి మేజిక్ ఎలా ఉంటుందో చూడాలి.