పోలవరం ఎత్తు తగ్గింపుపై అవాస్తవాలు.. ఘాటైన సమాధానం ఇచ్చిన సీఎం జగన్
ఏపీ జలప్రదాయినిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించాలని కేంద్ర ఆదేశించిందని.. త్వరలోనే ఆ ప్రాజెక్టు ఎత్తు తగ్గించే అవకాశాలు ఉన్నట్లు మీడియాలో విస్తృతంగా వార్తలు వచ్చాయి. డీపీఆర్‌లో పేర్కొన్న ఎత్తుకంటే కాస్త తగ్గించి ముంపు ప్రాంతాల వైశాల్యాన్ని తగ్గించుకోవాలని.. తద్వారా నిర్వాసితుల పరిహారం కూడా తగ్గుతుందని కేంద్ర సూచించడంతో ఏపీ ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. మీడియాలో దీనిపై విస్తృతంగా చర్చజరగడంతో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టత […]
ఏపీ జలప్రదాయినిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించాలని కేంద్ర ఆదేశించిందని.. త్వరలోనే ఆ ప్రాజెక్టు ఎత్తు తగ్గించే అవకాశాలు ఉన్నట్లు మీడియాలో విస్తృతంగా వార్తలు వచ్చాయి. డీపీఆర్‌లో పేర్కొన్న ఎత్తుకంటే కాస్త తగ్గించి ముంపు ప్రాంతాల వైశాల్యాన్ని తగ్గించుకోవాలని.. తద్వారా నిర్వాసితుల పరిహారం కూడా తగ్గుతుందని కేంద్ర సూచించడంతో ఏపీ ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
మీడియాలో దీనిపై విస్తృతంగా చర్చజరగడంతో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో పోలవరంపై నిజాలను వెల్లడించారు. పోలవరంపై మీడియాలో వస్తున్న ప్రచారాలను నమ్మవద్దని ఆయన తెలిపారు. మే చివరి నాటికి కాఫర్ డ్యాం పనులు పూర్తి చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
పోలవరం పనులు ఎంత వరకు వచ్చాయని సీఎం జగన్ ఆరా తీయగా.. ఇప్పటికే స్పిల్ వే పనులు పూర్తయ్యాయని.. గేట్ల బిగింపు, సిలిండర్ల అమరిక వేగవంతంగా పూర్తవుతున్నదని అధికారులు వెల్లడించారు. స్పిల్ వే పనులతో పాటు అప్రోచ్ చానల్ పనులు కూడా త్వరిత గతిన పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానంపై ప్రతిపాదనలు సిద్దం చేయాలని అన్ని రాష్ట్రాలను కోరింది. దీంతో సదరు డ్రాఫ్ట్‌ను కూడా సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.