టాప్ 10 చెత్త పాస్‌వర్డ్‌లివే.. స్ట్రాంగ్ పాస్‌వర్డ్ ఎలా పెట్టుకోవాలంటే..
ప్రస్తుతం నడుస్తున్న డిజిటల్ లైఫ్‌లో.. రకరకాల ఆన్‌లైన్ అకౌంట్లు వాడాల్సి వస్తోంది. అయితే చాలామంది తమ ఆన్‌లైన్ అకౌంట్లన్నింటికీ ఒకే పాస్‌వర్డ్ పెట్టుకుంటారు. లేదా గుర్తుండేందుకు సింపుల్ పాస్‌వర్డ్ పెట్టుకుంటారు. ఇదే చాలా డేంజర్ అంటున్నారు సైబర్ నిపుణులు. మన ఆన్ లైన్ భద్రత మనం పెట్టుకునే పాస్‌వర్డ్‌ల మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే అది చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. అయితే ఇప్పటికీ చాలామంది బేసిక్ పాస్ వర్డ్ లు పెట్టుకుంటూ సైబర్ నేరగాళ్లకు చిక్కుతున్నారు. దీనికి […]
ప్రస్తుతం నడుస్తున్న డిజిటల్ లైఫ్‌లో.. రకరకాల ఆన్‌లైన్ అకౌంట్లు వాడాల్సి వస్తోంది. అయితే చాలామంది తమ ఆన్‌లైన్ అకౌంట్లన్నింటికీ ఒకే పాస్‌వర్డ్ పెట్టుకుంటారు. లేదా గుర్తుండేందుకు సింపుల్ పాస్‌వర్డ్ పెట్టుకుంటారు. ఇదే చాలా డేంజర్ అంటున్నారు సైబర్ నిపుణులు.
మన ఆన్ లైన్ భద్రత మనం పెట్టుకునే పాస్‌వర్డ్‌ల మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే అది చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. అయితే ఇప్పటికీ చాలామంది బేసిక్ పాస్ వర్డ్ లు పెట్టుకుంటూ సైబర్ నేరగాళ్లకు చిక్కుతున్నారు. దీనికి సంబంధించి ‘నార్డ్ పాస్’ అనే కంపెనీ గతేడాదిలో వాడుకలో ఉన్న కొన్ని చెత్త పాస్ వర్డుల జాబితాను విడుదల చేసింది. అందులో ఎక్కువగా ఏవి ఉన్నాయంటే..
టాప్ 10 చెత్త పాస్‌వర్డ్స్ ఇవే :
ప్రపంచ వ్యాప్తంగా ‘123456’ అనే పాస్ వర్డ్ ను 25,43,285 మంది యూజర్లు వాడుతున్నారు. అలాగే 1 నుంచి 9 వరకూ నెంబర్లను 78,70,694 మంది యూజర్లు పాస్‌వర్డ్‌గా వాడుతున్నారు. వాటితో పాటు ‘picture1’ అనే ఈ పాస్‌వర్డ్‌ను 3,71,612 మంది ‘password’ అనే ఇంగ్లిష్ వర్డ్ ను 3,60,467 మంది యూజర్లు, ‘111111’ ను 2,30,507 మంది యూజర్లు, ‘123123’ ను1,89, 327 మంది యూజర్లు పాస్‌వర్డ్‌గా వాడుతున్నారు. అలాగే ఈ పాస్ వర్డ్ లన్నీ కొన్నివేల సార్లు అన్‌లైన్‌లో లీక్ అయ్యి, హ్యాకింగ్ కు గురయ్యాయని సర్వే చెప్తోంది. అందుకే ఇలాంటి పాస్ వర్డ్ లు పెట్టుకున్న వాళ్లు వెంటనే పాస్‌వర్డ్ ఛేంజ్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
పాస్‌వర్డ్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే..
– ఆన్‌లైన్ అకౌంటుకు స్ట్రాంగ్ పాస్‌వర్డ్ సెట్ చేయాలంటే ముందుగా 10 నుంచి 12 క్యారెక్టర్స్ ఉండాలి. పాస్ వర్డులో కేవలం లెటర్స్ మాత్రమే కాకుండా నెంబర్లు స్పెషల్ క్యారెక్టర్స్, క్యాపిటల్ లెటర్స్, లోయర్ లెటర్స్ కూడా ఉండేలా చూసుకోవాలి.
– పాస్‌వర్డ్‌లో డిక్షనరీ పదాలు ఉండకుండా చూసుకుంటే మంచిది.
– మీకు మాత్రమే గుర్తుండేలా స్పెల్లింగ్‌లో మార్పులు చేసి పదాలను సెట్ చేసుకోవచ్చు.
– ఇకపోతే పాస్‌వర్డ్.. యూజర్ నేమ్‌కు మ్యాచ్ అవ్వకుండా చూసుకోవాలి. వీటితో పాటు వరుస నెంబర్లు, ఫోన్ నెంబర్లు, ఆధార్, పాన్ కార్డులోని డిజిట్ నెంబర్లు ఉండకుండా చూసుకుంటే మంచిది.