మరో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన ప్రభాస్
వరుసగా సినిమాలు ప్రకటించడమే కాకుండా.. ఆ సినిమాల రిలీజ్ డేట్స్ కూడా బ్యాక్ టు బ్యాక్ ఎనౌన్స్ చేస్తున్నాడు ప్రభాస్. ఇందులో భాగంగా ఇప్పటికే ఆదిపురుష్, రాధేశ్యామ్ రిలీజ్ డేట్స్ ప్రకటించిన యంగ్ రెబల్ స్టార్.. తాజాగా తన కొత్త సినిమా సలార్ విడుదల తేదీని కూడా ప్రకటించాడు. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్యాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీ `సలార్`. సౌత్ ఇండియా సినిమాను […]
వరుసగా సినిమాలు ప్రకటించడమే కాకుండా.. ఆ సినిమాల రిలీజ్ డేట్స్ కూడా బ్యాక్ టు బ్యాక్ ఎనౌన్స్
చేస్తున్నాడు ప్రభాస్. ఇందులో భాగంగా ఇప్పటికే ఆదిపురుష్, రాధేశ్యామ్ రిలీజ్ డేట్స్ ప్రకటించిన యంగ్
రెబల్ స్టార్.. తాజాగా తన కొత్త సినిమా సలార్ విడుదల తేదీని కూడా ప్రకటించాడు.
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్యాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. కాంబినేషన్‌లో రూపొందుతోన్న
భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీ 'సలార్'. సౌత్ ఇండియా సినిమాను ప్యాన్ ఇండియా రేంజ్‌లో నిర్మిస్తూ భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న హోంబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరంగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. 2022, ఏప్రిల్ 14న సలార్
చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు సలార్ నుంచి మరో కొత్త స్టిల్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ లో
ఆనందాన్ని రెట్టింపు చేసింది యూనిట్.
సినిమాకు సంబంధించి ఆల్రెడీ షూటింగ్ మొదలైంది. ఫస్ట్ షెడ్యూల్ ను కూడా గోదావరిఖని, సింగరేణి
ప్రాంతాల్లో పూర్తిచేశారు. శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.