కార్పొరేట్ స్కూళ్లతో సీఎం కేసీఆర్ కుమ్మక్కు..!
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. సీఎం కేసీఆర్‌పై మరోసారి ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ .. కార్పొరేట్ స్కూళ్ల యాజమన్యాలతో లాలూచీ పడ్డారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. మూడు నెలల విద్యాసంవత్సరం కోసం ప్రైవేట్ స్కూళ్లు ఏడాది ఫీజులు వసూలు చేస్తున్నాయని.. ఈ విషయం తెలిసీ రాష్ట్ర ప్రభుత్వం సైలెంట్‌గా ఉంటుందని మండిపడ్డారు. ప్రైవేట్ స్కూళ్లు ఇటు తమ సిబ్బందికి వేతనాలు ఇవ్వడం లేదని.. లాక్డౌన్ టైంలో చాలా మంది టీచర్లు రోడ్డున […]
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. సీఎం కేసీఆర్‌పై మరోసారి ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ .. కార్పొరేట్ స్కూళ్ల యాజమన్యాలతో లాలూచీ పడ్డారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. మూడు నెలల విద్యాసంవత్సరం కోసం ప్రైవేట్ స్కూళ్లు ఏడాది ఫీజులు వసూలు చేస్తున్నాయని.. ఈ విషయం తెలిసీ రాష్ట్ర ప్రభుత్వం సైలెంట్‌గా ఉంటుందని మండిపడ్డారు. ప్రైవేట్ స్కూళ్లు ఇటు తమ సిబ్బందికి వేతనాలు ఇవ్వడం లేదని.. లాక్డౌన్ టైంలో చాలా మంది టీచర్లు రోడ్డున పడ్డారని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు విద్యార్థుల నుంచి మాత్రం మొత్తం ఫీజు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో చాలా మంది టీఆర్ఎస్ నేతలకు వాటాలు ఉన్నాయని ఆయన విమర్శించారు. అందుకే ముఖ్యమంత్రి సైలెంట్‌గా ఉన్నారన్నారు. ఫీజుల దోపిడీపై త్వరలో బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపబోతున్నదని హెచ్చరించారు. చాలా మంది టీఆర్ఎస్ నేతలు కార్పొరేట్ స్కూళ్ల యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని కూడా బండి సంజయ్ ఆరోపించారు.
ఆదివారం హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో బీజేవైఎం కార్యకర్తలతో బండి సంజయ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బాన్సువాడలో రెండు రోజుల కిందట జరిగిన బీజేపీ బహిరంగ సభలో నరసింహా అనే తొమ్మిదేళ్ల బుడ్డోడు కేసీఆర్ పాలనపై విమర్శలు గుప్పించారు. ఆ బుడ్డోడు బీజేపీ రాష్ట్ర నేతల హావభావాలతో మెప్పించాడు. దీంతో బుడ్డోడి ప్రతిభకు బండి సంజయ్ ఫిదా అయ్యారు. ఆదివారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నరసింహాతో కలిసి లంచ్ చేశారు.
హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య వెనుక టీఆర్‌ఎ్‌సకు చెందిన బడా నేతలు, కొంతమంది ఉన్నతాధికారులు ఉన్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఈ హత్యపై టీఆర్ఎస్ ప్రభుత్వం పారదర్శకంగా విచారణ చేపట్టడం లేదని విమర్శించారు.