Telugu Global
Health & Life Style

వ్యాక్సిన్ ఫర్ సేల్.. సింగిల్ డోస్ రూ.250

కరోనా టీకా పంపిణీకి సంబందించి భారత ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకూ కొవిడ్ వారియర్స్ కి ఉచితంగా ఇచ్చిన టీకాను, ఇకపై జన బాహుళ్యంలోకి తీసుకు రావాలని నిర్ణయించింది. ఈమేరకు సింగిల్ డోస్ టీకాకు రూ.250 చొప్పున నిర్ణయించింది. మార్చి 1నుంచి ప్రైవేటు ఆస్పత్రుల్లో డబ్బులు చెల్లించి కొవిడ్ టీకా తీసుకోవచ్చు. అయితే 60ఏళ్లుపైబడినవారు, 45నుంచి 60ఏళ్ల మధ్య ఉండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మాత్రమే టీకా వేయించుకునేందుకు అర్హులు. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి […]

వ్యాక్సిన్ ఫర్ సేల్.. సింగిల్ డోస్ రూ.250
X

కరోనా టీకా పంపిణీకి సంబందించి భారత ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకూ కొవిడ్ వారియర్స్ కి ఉచితంగా ఇచ్చిన టీకాను, ఇకపై జన బాహుళ్యంలోకి తీసుకు రావాలని నిర్ణయించింది. ఈమేరకు సింగిల్ డోస్ టీకాకు రూ.250 చొప్పున నిర్ణయించింది. మార్చి 1నుంచి ప్రైవేటు ఆస్పత్రుల్లో డబ్బులు చెల్లించి కొవిడ్ టీకా తీసుకోవచ్చు. అయితే 60ఏళ్లుపైబడినవారు, 45నుంచి 60ఏళ్ల మధ్య ఉండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మాత్రమే టీకా వేయించుకునేందుకు అర్హులు.

దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 1నుంచి ఫ్రంట్ లైన్ వారియర్స్ కి తొలిదశ టీకా పంపిణీ మొదలైంది. ఫిబ్రవరి 28నుంచి వీరికి రెండో డోసు పంపిణీ చేస్తారు. మార్చి 1నుంచి మలి దశ టీకా పంపిణీ మొదలు పెట్టబోతోంది కేంద్రం. 60ఏళ్లుపైబడినవారికి మలిదశలో ఫస్ట్ ప్రయారిటీ ఇస్తోంది. అయితే వీరి సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా టీకా పంపిణి చేయడం కష్టసాధ్యంగా మారుతుంది. అందుకే ప్రైవేటుకి కూడా అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వం. ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకా వేయించుకునే స్థోమత ఉన్నవారు రూ.250 చెల్లించి వ్యాక్సినేషన్ చేయించుకోవచ్చు. ఇందులో వ్యాక్సిన్‌ ధర రూ.150 కాగా.. సర్వీస్‌ ఛార్జి రూ.100 . ప్రైవేటుగా టీకా తీసుకునేవారు రెండు డోసులకు కలిపి రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వేసే వ్యాక్సిన్‌కు అయ్యే ఖర్చును మాత్రం కేంద్రమే భరిస్తుంది.

ఉచితమా? కొనుగోలా..? వినియోగదారుల ఇష్టం..
కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవాలనుకునేవారు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తే ఉచితంగా ఇస్తారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వేచి చూడటం ఇష్టంలేనివారు, దాని ఖరీదు భరించగలిగేవారు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించవచ్చు. ప్రభుత్వమై లేక ప్రైవేటా అనేది వినియోగదారులే నిర్ణయించుకోవచ్చు. అయితే ముందుగానే ప్రభుత్వానికి చెందిన కొవిన్‌ 2.0 పోర్టల్‌ ద్వారా గానీ, ఆరోగ్య సేతు యాప్‌ ద్వారా గానీ, వ్యాక్సినేషన్‌ కేంద్రం వద్ద గానీ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దేశంలో ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలు మినహాయిస్తే దాదాపు 10వేల ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా టీకా అమ్మకాలు మార్చి 1నుంచి మొదలు కాబోతున్నాయి.

First Published:  27 Feb 2021 11:18 AM GMT
Next Story