చెక్ లో పవన్ కల్యాణ్ మిస్
పవన్ కల్యాణ్ అంటే నితిన్ కు ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ప్రతి సినిమాలో పవన్ కు సంబంధించి ఏదో ఒక అంశాన్ని చొప్పిస్తాడు నితిన్. రీమిక్స్ లాంటివి చేయలేని పక్షంలో కనీసం పవన్ పోస్టర్ అయినా చూపించి సంతోషపడతాడు. కానీ చెక్ సినిమాలో ఆ సెంటిమెంట్ ను మిస్సయ్యాడు నితిన్. ఇదే విషయంపై తాజాగా స్పందించాడు నితిన్. చెక్ సినిమాలో పవన్ ను చూపించలేకపోయినందుకు, పవన్ పాటను రీమిక్స్ చేయనందుకు బాధపడ్డాడు. దీనికి అతడు ఓ […]
పవన్ కల్యాణ్ అంటే నితిన్ కు ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ప్రతి సినిమాలో పవన్ కు
సంబంధించి ఏదో ఒక అంశాన్ని చొప్పిస్తాడు నితిన్. రీమిక్స్ లాంటివి చేయలేని పక్షంలో కనీసం పవన్
పోస్టర్ అయినా చూపించి సంతోషపడతాడు. కానీ చెక్ సినిమాలో ఆ సెంటిమెంట్ ను మిస్సయ్యాడు
నితిన్.
ఇదే విషయంపై తాజాగా స్పందించాడు నితిన్. చెక్ సినిమాలో పవన్ ను చూపించలేకపోయినందుకు,
పవన్ పాటను రీమిక్స్ చేయనందుకు బాధపడ్డాడు. దీనికి అతడు ఓ రీజన్ కూడా చెప్పాడు.
చెక్ సినిమా పూర్తిగా జైలు బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కింది. ఇలాంటి బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాలో పవన్ పోస్టర్
ను పెడితే బాగుండదు. పైగా తప్పుడు సందేశం ఇచ్చినట్టవుతుంది. అందుకే చెక్ సినిమాలో పవన్ పోస్టర్
ను ఎక్కడా వాడలేదని చెప్పుకొచ్చాడు నితిన్.
మరోవైపు పవన్ ఫ్యాన్స్ మాత్రం నితిన్ తన సెంటిమెంట్ తప్పాడు కాబట్టి, చెక్ సినిమా ఫెయిల్
అయిందంటూ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు.