Telugu Global
National

కాంగ్రెస్​ బలహీనపడుతోంది.. ఈ మాటన్నది ఆ పార్టీ నేతే..!

కాంగ్రెస్​ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది. ఆ పార్టీలోని లోపాలను స్వయంగా పార్టీ సభ్యులే బహిరంగంగా విమర్శిస్తుంటారు. నిజానికి ఇటువంటి స్వేచ్ఛ మంచిదే కావచ్చు. కానీ చాలామంది కాంగ్రెస్​ నేతలు ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తుంటారు. గ్రూపు రాజకీయాలకు తెరలేపుతారు. ఫైనల్​గా సొంత పార్టీకే నష్టం చేస్తూ ఉంటారు. కాంగ్రెస్​ లోని సీనియర్​ నేతలంతా ఈ కోవలోకే చెందుతారు అని చెప్పలేము.. కానీ ఇటువంటి నేతలు చాలా మందే ఉంటారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్​ సీనియర్​ […]

కాంగ్రెస్​ బలహీనపడుతోంది.. ఈ మాటన్నది ఆ పార్టీ నేతే..!
X

కాంగ్రెస్​ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది. ఆ పార్టీలోని లోపాలను స్వయంగా పార్టీ సభ్యులే బహిరంగంగా విమర్శిస్తుంటారు. నిజానికి ఇటువంటి స్వేచ్ఛ మంచిదే కావచ్చు. కానీ చాలామంది కాంగ్రెస్​ నేతలు ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తుంటారు. గ్రూపు రాజకీయాలకు తెరలేపుతారు. ఫైనల్​గా సొంత పార్టీకే నష్టం చేస్తూ ఉంటారు.

కాంగ్రెస్​ లోని సీనియర్​ నేతలంతా ఈ కోవలోకే చెందుతారు అని చెప్పలేము.. కానీ ఇటువంటి నేతలు చాలా మందే ఉంటారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్​ సీనియర్​ నేత కపిల్​ సిబల్​ సొంతపార్టీపైనే విమర్శలు ఎక్కుపెట్టారు. కశ్మీర్​లో కాంగ్రెస్​ సీనియర్​ నేత గులాం నబీ అజాద్ ఎంపీగా త్వరలో పదవీ విరమణ చేయబోతున్న సందర్భంగా ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వెళ్లిన కపిల్​ సిబల్​ విమర్శలకు పదును పెట్టారు.

‘కాంగ్రెస్​ పార్టీ బలహీనంగా ఉంది.. ఈ విషయాన్ని పార్టీ నేతలు గ్రహించాలి. అందుకోసం ఏం చేయాలో ఆలోచించాలి. ఆ విషయం మాట్లాడటానికే మేము ఇక్కడ సమావేశమయ్యాం’ అంటూ ఆయన సంచలన విమర్శలు చేశారు. పనిలో పనిగా గులాం నబీ ఆజాద్​ను పొగడ్తల్లో ముంచెత్తారు. కశ్మీర్​లో ఇవాళ కాంగ్రెస్​ బతికి ఉందంటే అందుకు కారణం ఆజాదే నని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాక కాంగ్రెస్​ పార్టీ అన్ని వర్గాల ప్రజలను సమానదృష్టితో చూస్తుందని చెప్పారు. కుల, మత, జాతి విభేదాలు కాంగ్రెస్​కు లేవని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే సీనియర్​ కాంగ్రెస్​ నేత సొంతపార్టీపైనే విమర్శలు గుప్పించడం వివాదాస్పదమైంది.
గతంలోనూ కొందరు సీనియర్​ నేతలు కాంగ్రెస్​ పార్టీని విమర్శిస్తూ ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. అప్పట్లో ఈ విషయమై పెను దుమారం రేగింది. దీనిపై రాహుల్​ గాంధీ సీనియర్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి.

కాంగ్రెస్​లో రాణించాలంటే కచ్చితంగా అధిష్ఠానానికి విధేయంగా ఉండాలి. ఇక్కడ అధిష్ఠానం అంటే నెహ్రూ కుటుంబం. ఈ విషయం అంందరికీ తెలిసిందే. అయితే కొంత కాలంగా కాంగ్రెస్​ పార్టీ బలహీనపడుతుందనే వాదన తెరమీదకు వస్తున్నది. కేంద్ర ప్రభుత్వం అనేక ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నప్పటికీ.. ప్రజా పోరాటాలు నిర్మించడంలో కాంగ్రెస్​ విఫలమవుతూ వస్తుంది. ఆ పార్టీకి ఉన్న క్యాడర్​తో బలమైన ఉద్యమాలు నిర్మించవచ్చు. కానీ సరైన దిశా నిర్దేశం లేకపోవడంతో కాంగ్రెస్​ చతికిల పడుతున్నది. దీనికి తోడు సీనియర్ల విమర్శలు మరింత నష్టం చేకూరుస్తున్నాయి.

First Published:  27 Feb 2021 10:51 AM GMT
Next Story