Telugu Global
Cinema & Entertainment

ఆహా గూటికి చేరిన నాంది

అల్లరినరేశ్ సీరియస్ పాత్రలో నటించిన నాంది సినిమా ఇప్పటికే అల్లు అరవింద్ చెంతకు చేరిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రీమేక్ రైట్స్ ను దాదాపు 2 కోట్ల రూపాయలకు అల్లు అరవింద్ దక్కించుకున్నారు. ఇప్పుడు ఇదే సినిమాకు సంబంధించి అల్లు అరవింద్ మరో డీల్ పూర్తిచేశారు. ఆహా యాప్ తరఫున నాంది సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను దక్కించుకున్నారు అల్లు అరవింద్. తాజా సమాచారం ప్రకారం.. అటుఇటుగా రెండున్నర కోట్ల రూపాయలకు ఈ స్ట్రీమింగ్ రైట్స్ […]

ఆహా గూటికి చేరిన నాంది
X

అల్లరినరేశ్ సీరియస్ పాత్రలో నటించిన నాంది సినిమా ఇప్పటికే అల్లు అరవింద్ చెంతకు చేరిన సంగతి
తెలిసిందే. ఈ సినిమా రీమేక్ రైట్స్ ను దాదాపు 2 కోట్ల రూపాయలకు అల్లు అరవింద్ దక్కించుకున్నారు.
ఇప్పుడు ఇదే సినిమాకు సంబంధించి అల్లు అరవింద్ మరో డీల్ పూర్తిచేశారు.

ఆహా యాప్ తరఫున నాంది సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను దక్కించుకున్నారు అల్లు అరవింద్. తాజా సమాచారం ప్రకారం.. అటుఇటుగా రెండున్నర కోట్ల రూపాయలకు ఈ స్ట్రీమింగ్ రైట్స్
అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆహా యాప్ లో నాంది సినిమా కనువిందు చేయబోతోంది.

రిలీజ్ కు ముందు నాంది సినిమా రైట్స్ అమ్ముడుపోలేదు. అల్లరి నరేశ్ కు మార్కెట్ లేకపోవడం, పైగా
సీరియస్ మూవీ కావడంతో అంతా వెనక్కుతగ్గారు. తీరా థియేటర్లలో హిట్టయిన తర్వాత ఈ సినిమాకు
మంచి డిమాండ్ వచ్చింది. రీమేక్ రైట్స్ తో పాటు, డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ మంచి మొత్తాలకు
అమ్ముడుపోయాయి. ఇప్పుడీ సినిమా శాటిలైట్ రైట్స్ కు మరింత డిమాండ్ పెరిగింది.

First Published:  27 Feb 2021 11:53 AM IST
Next Story