Telugu Global
National

ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ భగవత్​ సంచలన వ్యాఖ్యలు.. పాక్​ను కలిపేసుకుంటాం..

ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్​ భగవత్​ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పటికైనా పాకిస్థాన్​ను భారత్​లో విలీనం చేసుకుంటామని .. అఖండ భారతం నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు. దేవుడు భారతదేశాన్ని ఒక్కటిగానే సృష్టించాడని చెప్పారు. దీన్ని ఎవరూ విడదీయలేరని పేర్కొన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘దేశ విభజన అసాధ్యమని బ్రిటీష్​ పార్లమెంట్లో లార్డ్​ వేవెల్​ అభిప్రాయపడ్డారు. తొలి ప్రధాని నెహ్రూ కూడా దేశ విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. దేశ విభజన మూర్ఖులు చేసే పని ఆయన అన్నారు. కానీ […]

ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ భగవత్​ సంచలన వ్యాఖ్యలు.. పాక్​ను కలిపేసుకుంటాం..
X

ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్​ భగవత్​ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పటికైనా పాకిస్థాన్​ను భారత్​లో విలీనం చేసుకుంటామని .. అఖండ భారతం నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు. దేవుడు భారతదేశాన్ని ఒక్కటిగానే సృష్టించాడని చెప్పారు. దీన్ని ఎవరూ విడదీయలేరని పేర్కొన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

‘దేశ విభజన అసాధ్యమని బ్రిటీష్​ పార్లమెంట్లో లార్డ్​ వేవెల్​ అభిప్రాయపడ్డారు. తొలి ప్రధాని నెహ్రూ కూడా దేశ విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. దేశ విభజన మూర్ఖులు చేసే పని ఆయన అన్నారు. కానీ అప్పట్లో ఎందుకంత హడావుడిగా దేశ విభజన చేశారో తెలియదు. ఎప్పటికైనా పాకిస్థాన్​ భారత్​తో కలవాల్సిందే. ఆ రోజు మరెంతో దూరంలో లేదు’ అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

అఖండ భారత్​ను ఏర్పాటు చేయడమే ఆర్​ఎస్​ఎస్​ లక్ష్యం అయితే తాజాగా భగవత్​ ఆ కోణంలోనే మాట్లాడారు. ప్రస్తుతం ఆయన తెలంగాణలో పర్యటిస్తున్నారు. ద్వి సహస్రావధాని మాడుగుల నాగఫణి శర్మ రచించిన ‘విశ్వభారతం’ అనే పుస్తకాన్ని గురువారం హైదరాబాద్​లోని హైటెక్స్​లో ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్​ భగవత్​ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు.

అఖండ భారత్​తోనే అభివృద్ధి సాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని దేశాలు మనతో విడిపోయి ఎంతో నష్టపోయాయని చెప్పారు.అవన్నీ మళ్లీ పునరేకీకరణ కావాల్సి ఉందని చెప్పారు. సహనం, ఓర్పు వంటి గుణాలకు మనదేశం కేంద్రం అని ఆయన పేర్కొన్నారు. భారత్​ నుంచి విడిపోయిన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు. అక్కడ నిత్యం అశాంతి నెలకొంటుందని చెప్పారు. ప్రతి హిందువు సేవాభావం అలవర్చుకోవాలని సూచించారు. అహంకారం విడనాడాలని పేర్కొన్నారు. ఇవాళ మోహన్​భాగవత్​ ఆదిలాబాద్​లో పర్యటించనున్నారు.

First Published:  26 Feb 2021 6:45 AM IST
Next Story