ఇక ఆ సీక్వెల్ లేనట్టే!
ఈరోజు థియేటర్లలోకి వచ్చింది చెక్ సినిమా. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమాను సీక్వెల్ ఉండేలా ముగించారు. సినిమా క్లైమాక్స్ లో హీరో నితిన్ జైలు నుంచి తప్పించుకుంటాడు. అక్కడ శుభం కార్డు పడుతుంది. సో.. సీక్వెల్ తీయడానికి కావాల్సినంత స్టఫ్ ఇక్కడ ఉంది. అయితే సీక్వెల్ వస్తుందా అనేదే అందరి డౌట్. ఎందుకంటే, చెక్ సినిమాకు ఆల్రెడీ మిక్స్ డ్ టాక్ వచ్చేసింది. క్రిటిక్స్ ఇప్పటికే ఈ సినిమాను చీల్చి చెండాడారు. మొదటి రోజు హిట్ […]
ఈరోజు థియేటర్లలోకి వచ్చింది చెక్ సినిమా. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమాను సీక్వెల్ ఉండేలా ముగించారు. సినిమా క్లైమాక్స్ లో హీరో నితిన్ జైలు నుంచి తప్పించుకుంటాడు. అక్కడ శుభం కార్డు పడుతుంది. సో.. సీక్వెల్ తీయడానికి కావాల్సినంత స్టఫ్ ఇక్కడ ఉంది. అయితే సీక్వెల్ వస్తుందా అనేదే అందరి డౌట్.
ఎందుకంటే, చెక్ సినిమాకు ఆల్రెడీ మిక్స్ డ్ టాక్ వచ్చేసింది. క్రిటిక్స్ ఇప్పటికే ఈ సినిమాను చీల్చి చెండాడారు. మొదటి రోజు హిట్ టాక్ రాలేదు కాబట్టి, వీకెండ్ గడిచేసరికి ఈ సినిమా యావరేజ్ టాక్ తో సరిపెట్టుకునేలా ఉంది. సో.. ఇలా యావరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమాకు సీక్వెల్ ప్రకటిస్తారని అనుకోవడం అత్యాశే అవుతుంది.
ఓ సినిమా సూపర్ హిట్టయినప్పుడు మాత్రమే దానికి సీక్వెల్ వస్తుంది. ఫ్లాప్ అయినా, యావరేజ్ గా ఆడినా సీక్వెల్ తీయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. దీంతో చెక్ సీక్వెల్ ఇప్పుడు డోలాయమానంలో పడింది.