సముద్రంలోకి దూకేసిన రాహుల్.. దాని వెనక ఓ స్కెచ్ ఉంది..!
రాహుల్‌గాంధీలో ఓ విలక్షణమైన రాజకీయనేత ఉంటాడు.. కానీ చాలా ఆశ్చర్యకరంగా దాన్ని ఎవరూ గుర్తించరు. ప్రజలతో వ్యవహరించే తీరులోనూ వివిధ వృత్తుల వాళ్లను పలకరించే విధానంలోనూ రాహుల్ ఓ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంటాడు. కానీ ఆయన మీద ఓ ముద్రతో అవన్నీ పక్కకు పోతాయి. ప్రస్తుతం రాహుల్‌గాంధీ కేరళలో పర్యటిస్తున్నారు. బుధవారం ఆయన కేరళలో కొల్లాంకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి మత్స్యకారులతో ముచ్చటించారు. వాళ్ల సాదకబాదకాలు తెలుసుకున్నారు. అనంతరం రాహుల్ అక్కడి అరేబియా సముద్రంలో దూకారు. ఆ […]
రాహుల్‌గాంధీలో ఓ విలక్షణమైన రాజకీయనేత ఉంటాడు.. కానీ చాలా ఆశ్చర్యకరంగా దాన్ని ఎవరూ గుర్తించరు. ప్రజలతో వ్యవహరించే తీరులోనూ వివిధ వృత్తుల వాళ్లను పలకరించే విధానంలోనూ రాహుల్ ఓ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంటాడు. కానీ ఆయన మీద ఓ ముద్రతో అవన్నీ పక్కకు పోతాయి. ప్రస్తుతం రాహుల్‌గాంధీ కేరళలో పర్యటిస్తున్నారు. బుధవారం ఆయన కేరళలో కొల్లాంకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి మత్స్యకారులతో ముచ్చటించారు. వాళ్ల సాదకబాదకాలు తెలుసుకున్నారు.
అనంతరం రాహుల్ అక్కడి అరేబియా సముద్రంలో దూకారు. ఆ టైంలో ఆయనవెంట మత్స్యకారులు కూడా ఉన్నారు. అయితే చేపలు పట్టడం ఎంత కష్టమైన పనో తెలుసుకోవడానికి ఆయన సముద్రంలోకి దూకారట. రాహుల్‌గాంధీ సముద్రంలోకి దూకబోతున్నట్టు ఆయన భద్రతాసిబ్బందికి గానీ.. ఆయన వెంట ఉన్న అనుచరులకు గానీ తెలియదు . దీంతో వాళ్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. నిజానికి రాహుల్ మంచి ఈతగాడు. కాబట్టి అతడు సముద్ర ఈతను ఎంజాయ్ చేశాడు. ఆయన దాదాపు 10 నిమిషాలపాటు ఈత కొట్టాడు. అంతకుముందు రాహుల్‌గాంధీ మత్స్యకారులతో మాట్లాడి వాళ్ల కష్టసుఖాలను తెలుసుకున్నారు.
రాహుల్ గాంధీ సముద్రంలో దూకిన సమయంలో బ్లూ టీ షర్టు, ఖాకీ ప్యాంటు ధరించి ఉన్నారు. రాహుల్ ఈతకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె. సి. వేణుగోపాల్, టి.ఎన్.ప్రతాపన్ సహా నలుగురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
అనంతరం రాహుల్‌గాంధీ కాసేపు పడవలో ప్రయాణించారు. మత్స్యకారులతో కలిసి చేపలు, రొట్టె ఆరగించారు. అయితే త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాహుల్ ఎన్నికల జిమ్మిక్కులు చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.