Telugu Global
Cinema & Entertainment

మోసగాళ్లతో చేయికలిపిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి మోసగాళ్లతో చేయి కలిపారు. వాళ్లకు ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు. ఇక్కడ మోసగాళ్లు మరెవరో కాదు, మంచు విష్ణు అతడి గ్యాంగ్. మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన సినిమా మోసగాళ్లు. ఈ సినిమా ట్రయిలర్ ను చిరంజీవి ఆవిష్కరించారు. అలా మోసగాళ్లు యూనిట్ కు తన పూర్తి మద్దతు అందించారు. ఇక ట్రయిలర్ విషయానికొస్తే.. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ స్కామ్ నేపథ్యంలో ఈ సినిమా వస్తోంది. ఆన్ లైన్ మోసంలో భాగంగా వేల […]

మోసగాళ్లతో చేయికలిపిన చిరంజీవి
X

మెగాస్టార్ చిరంజీవి మోసగాళ్లతో చేయి కలిపారు. వాళ్లకు ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు. ఇక్కడ మోసగాళ్లు మరెవరో కాదు, మంచు విష్ణు అతడి గ్యాంగ్. మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన సినిమా మోసగాళ్లు. ఈ సినిమా ట్రయిలర్ ను చిరంజీవి ఆవిష్కరించారు. అలా మోసగాళ్లు యూనిట్ కు తన పూర్తి మద్దతు అందించారు.

ఇక ట్రయిలర్ విషయానికొస్తే.. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ స్కామ్ నేపథ్యంలో ఈ సినిమా వస్తోంది. ఆన్ లైన్ మోసంలో భాగంగా వేల కోట్ల రూపాయల్ని మంచు విష్ణు, అతడి చెల్లెలు కాజల్ దొంగిలిస్తారు. ఈ కేసును సునీల్ షెట్టి ఎలా ఛేదించాడనేది మోసగాళ్లు స్టోరీ.

జెఫ్రీ గీ చిన్ డైరక్ట్ చేసిన ఈ పాన్ ఇండియా మూవీలో నవదీప్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించారు. విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ అందించాడు. త్వరలోనే థియేటర్లలోకి రానుంది మోసగాళ్లు.

First Published:  25 Feb 2021 1:03 PM IST
Next Story