Telugu Global
Cinema & Entertainment

రవితేజ హీరోయిన్ ఎవరు?

తన సినిమాలతో ఎప్పుడూ కొత్త హీరోయిన్లను టాలీవుడ్ కు పరిచయం చేయడానికి ట్రై చేస్తుంటాడు రవితేజ. అతడి సినిమాలతో ఎంతోమంది హీరోయిన్లు తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇప్పుడిదే కోవలో మరో ముద్దుగుమ్మను తెలుగు సినీపరిశ్రమకు పరిచయం చేసే ఆలోచనలో ఉన్నాడు మాస్ రాజా. రీసెంట్ గా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా ఎనౌన్స్ చేశాడు రవితేజ. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ ను ఇంకా ఫిక్స్ […]

రవితేజ హీరోయిన్ ఎవరు?
X

తన సినిమాలతో ఎప్పుడూ కొత్త హీరోయిన్లను టాలీవుడ్ కు పరిచయం చేయడానికి ట్రై చేస్తుంటాడు
రవితేజ. అతడి సినిమాలతో ఎంతోమంది హీరోయిన్లు తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇప్పుడిదే
కోవలో మరో ముద్దుగుమ్మను తెలుగు సినీపరిశ్రమకు పరిచయం చేసే ఆలోచనలో ఉన్నాడు మాస్ రాజా.

రీసెంట్ గా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా ఎనౌన్స్ చేశాడు రవితేజ. పీపుల్ మీడియా
ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ ను ఇంకా ఫిక్స్
చేయలేదు. తాజా సమాచారం ప్రకారం… ఐశ్వర్య మీనన్ ను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని
అనుకుంటున్నారు.

తమిళ్ లో ఓ మోస్తరు గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్య మీనన్. కోలీవుడ్ సినిమాల కంటే.. తన
అందచందాలతో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది ఈ బ్యూటీ. ఇప్పుడీ అమ్మడ్ని రవితేజ
సినిమాతో టాలీవుడ్ కు గ్రాండ్ గా పరిచయం చేయాలనుకుంటున్నారు మేకర్స్.

నిజానికి టాలీవుడ్ జనాలకు ఐశ్వర్య మీనన్ కొత్తకాదు. 2-3 డబ్బింగ్ సినిమాలతో ఆమె తెలుగులో
కనిపించింది. కాకపోతే రవితేజ సినిమా ఆమెకు తొలి తెలుగు స్ట్రయిట్ మూవీ అవుతుంది.

First Published:  24 Feb 2021 2:35 AM IST
Next Story