ఫోక్ స్టయిల్ లో అదరగొట్టిన జగదీశ్
నాని హీరోగా నటిస్తున్న సినిమా టక్ జగదీష్. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు. రేపు నాని పుట్టినరోజు. ఈ సందర్భంగా ఒక రోజు ముందే టక్ జగదీష్ టీజర్ రిలీజైంది. ఇక టీజర్ రివ్యూ చూద్దాం రెగ్యులర్ గా వచ్చే టీజర్లకు భిన్నంగా.. ఈ సినిమా టీజర్ ను ఓ ఫోక్ సాంగ్ పై కట్ చేశారు. తమన్ అందించిన జానపద బాణీపై సినిమాకు సంబంధించిన కీలకమైన సన్నివేశాల్ని […]
నాని హీరోగా నటిస్తున్న సినిమా టక్ జగదీష్. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు
సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు. రేపు నాని పుట్టినరోజు. ఈ సందర్భంగా ఒక రోజు ముందే టక్ జగదీష్
టీజర్ రిలీజైంది. ఇక టీజర్ రివ్యూ చూద్దాం
రెగ్యులర్ గా వచ్చే టీజర్లకు భిన్నంగా.. ఈ సినిమా టీజర్ ను ఓ ఫోక్ సాంగ్ పై కట్ చేశారు. తమన్
అందించిన జానపద బాణీపై సినిమాకు సంబంధించిన కీలకమైన సన్నివేశాల్ని పేర్చుకుంటూ వెళ్లారు.
ఈ ప్రయోగం కొత్తగా ఉంది.
ఇంతకుముందు సిత్తరాల సిరపడు, ఊరికి ఉత్తరాన లాంటి జానపదాన్ని అందించిన తమన్, ఈ సినిమా
కోసం మరో మంచి బాణీ అందించాడు.
సినిమాలో కుటుంబకథా విలువలతో పాటు యాక్షన్ పాళ్లు కూడా ఎక్కువగానే ఉన్నాయనే విషయాన్ని
టీజర్ లో చెప్పేశారు. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను ఏప్రిల్ 23న
రిలీజ్ చేయబోతున్నారు.