Telugu Global
Cinema & Entertainment

నా మూవీ నేను చూడలేకపోతున్నాను

తొలి ఛాన్స్, తొలి సినిమా… ఆ మూవీని కుటుంబ సభ్యులతో కలిసి ప్రేక్షకుల విజిల్స్ మధ్య, బిగ్ స్క్రీన్ పై చూస్తే ఆ మజానే వేరు. ఇలాంటి అనుభవాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోరు. కానీ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ మాత్రం ఆ అనుభూతిని మిస్ అవుతోంది. తన తొలి తెలుగు సినిమా చెక్ ను, హైదరాబాద్ లో చూడలేకపోతోంది. “హైదరాబాద్ లో ఫ్యామిలీతో కలిసి చూడాలని అనుకున్నాను. అయితే, 26వ తేదీన తమ్ముడికి ఎగ్జామ్ ఉంది. అందువల్ల, […]

నా మూవీ నేను చూడలేకపోతున్నాను
X

తొలి ఛాన్స్, తొలి సినిమా… ఆ మూవీని కుటుంబ సభ్యులతో కలిసి ప్రేక్షకుల విజిల్స్ మధ్య, బిగ్ స్క్రీన్ పై చూస్తే ఆ మజానే వేరు. ఇలాంటి అనుభవాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోరు. కానీ హీరోయిన్ ప్రియా ప్రకాష్
వారియర్ మాత్రం ఆ అనుభూతిని మిస్ అవుతోంది. తన తొలి తెలుగు సినిమా చెక్ ను, హైదరాబాద్ లో
చూడలేకపోతోంది.

“హైదరాబాద్ లో ఫ్యామిలీతో కలిసి చూడాలని అనుకున్నాను. అయితే, 26వ తేదీన తమ్ముడికి ఎగ్జామ్
ఉంది. అందువల్ల, ఫ్యామిలీ హైదరాబాద్ రావడం కుదరడం లేదు. కొచ్చిలో కూడా ‘చెక్’ రిలీజ్
అవుతుంది. ఫ్యామిలీతో కలిసి అక్కడ షోకి వెళ్లే ప్లాన్ చేయాలి.”

ఇలా తన అసంతృప్తిని బయటపెట్టింది ప్రియా ప్రకాష్. తొలి తెలుగు సినిమాను, తెలుగు ప్రేక్షకుల మధ్య
చూడలేకపోతున్నందుకు చాలా బాధగా ఉందని తెలిపింది. మంచి పాత్రలు దొరికితే ఇకపై కూడా
తెలుగులో నటిస్తానని తెలిపిన ప్రియా ప్రకాష్.. మరో 2 సినిమాలు చేస్తే.. తెలుగులో అనర్గలంగా
మాట్లాడతానని చెబుతోంది.

First Published:  23 Feb 2021 1:45 PM IST
Next Story