Telugu Global
Cinema & Entertainment

భీష్మ లుక్ లో అదరగొట్టిన బాలయ్య

నేడు భీష్మ ఏకాదశి సందర్భంగా నటసింహ నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ కధానాయకుడు చిత్రంలో తాను భీష్ముని పాత్రలో నటించిన స్టిల్స్ ను విడుదల చేశారు. నిజానికి ఈ ఎపిసోడ్ కథానాయకుడు సినిమాలో లేదు. దీనిపై బాలయ్య రియాక్ట్ అయ్యారు. “భీష్మ పాత్రంటే నాకెంతో ఇష్టం. నాన్నగారు, ఆయన వయసుకి మించిన భీష్మ పాత్ర పోషించి ప్రేక్షకుల విశేష ఆదరాభిమానాలను అందుకున్నారు. ఆ చిత్రం, అందులోని నాన్నగారు నటించిన భీష్ముని పాత్ర అంటే నాకెంతో ఇష్టం. అందుకనే ఎన్టీఆర్ […]

భీష్మ లుక్ లో అదరగొట్టిన బాలయ్య
X

నేడు భీష్మ ఏకాదశి సందర్భంగా నటసింహ నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ కధానాయకుడు చిత్రంలో తాను భీష్ముని పాత్రలో నటించిన స్టిల్స్ ను విడుదల చేశారు. నిజానికి ఈ ఎపిసోడ్ కథానాయకుడు సినిమాలో లేదు. దీనిపై బాలయ్య రియాక్ట్ అయ్యారు.

“భీష్మ పాత్రంటే నాకెంతో ఇష్టం. నాన్నగారు, ఆయన వయసుకి మించిన భీష్మ పాత్ర పోషించి ప్రేక్షకుల విశేష ఆదరాభిమానాలను అందుకున్నారు. ఆ చిత్రం, అందులోని నాన్నగారు నటించిన భీష్ముని పాత్ర అంటే నాకెంతో ఇష్టం. అందుకనే ఎన్టీఆర్ కధానాయకుడు చిత్రంలో భీష్ముని సన్నివేశాలు తీశాము. అందులో నేను భీష్మునిగా నటించాను. అయితే నిడివి ఎక్కువ అవడం వలన ఆ చిత్రంలో ఆ సన్నివేశాలు ఉంచడం కుదరలేదు. ఇవాళ భీష్మ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆ పాత్రకి సంబంధించిన ఫోటోలను ప్రేక్షకులతో, అభిమానులతో పంచుకోవడం ఆనందంగా ఉంది.”

ఊహించని విధంగా బాలయ్య నుంచి ఓ గెటప్ వచ్చేసరికి నందమూరి అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. గతంలో కూడా బాలయ్య ఇలానే తను దర్శకత్వం వహించిన నర్తనశాల సినిమా నుంచి సన్నివేశాల్ని విడుదల చేసి అభిమానుల్ని అలరించారు.

First Published:  23 Feb 2021 1:41 PM IST
Next Story