విరాటపర్వం మూవీ అప్ డేట్స్
రానా, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘విరాటపర్వం’. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. “రివల్యూషన్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ లవ్” అనేది ట్యాగ్‌లైన్. ఈ మూవీ అప్ డేట్స్ విషయానికొస్తే.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. మరో నెల రోజుల పాటు పోస్ట్ ప్రొడక్షన్ జరిగే అవకాశం ఉంది. ఏప్రిల్ 30న విరాటపర్వం సినిమాను రిలీజ్ చేస్తున్నారు. లేటెస్ట్‌గా […]
రానా, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘విరాటపర్వం’. డి.
సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని
నిర్మిస్తున్నారు. “రివల్యూషన్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ లవ్” అనేది ట్యాగ్‌లైన్.
ఈ మూవీ అప్ డేట్స్ విషయానికొస్తే.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. మరో నెల రోజుల
పాటు పోస్ట్ ప్రొడక్షన్ జరిగే అవకాశం ఉంది. ఏప్రిల్ 30న విరాటపర్వం సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
లేటెస్ట్‌గా చిత్ర బృందం మ్యూజికల్ ప్రమోషన్‌కు సన్నాహాలు చేస్తోంది. ఫిబ్రవరి 25న ఫస్ట్ సాంగ్ “కోలు
కోలు” లిరికల్ వీడియోను రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మరో పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్‌లో కాకతీయ తోరణం దగ్గర హీరోయిన్ సాయిపల్లవి డాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు.
యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్పటివరకూ కనిపించని పాత్రల్లో రానా, సాయిపల్లవి
నటిస్తున్నారు.