Telugu Global
Cinema & Entertainment

ఉప్పెనపై 'చిరు' ప్రశంసలు

తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్. ఈ సినిమాతో మెగాస్టార్ అంచనా మరోసారి నిజమైంది. ఎందుకంటే, ఈ కథను సెలక్ట్ చేసింది చిరంజీవి. ఎన్నో సిట్టింగ్స్ తర్వాత ఈ కథకు ఆయన ఓకే చెప్పారు. తన అంచనా నిజమైనందుకు చిరంజీవి చాలా హ్యాపీగా ఉన్నారు. తన ఆనందాన్ని యూనిట్ సభ్యులందరితో పంచుకుంటున్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు చిరంజీవి. ఓ నోట్ తో పాటు ఓ మంచి గిఫ్ట్ […]

ఉప్పెనపై చిరు ప్రశంసలు
X

తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్. ఈ సినిమాతో మెగాస్టార్ అంచనా
మరోసారి నిజమైంది. ఎందుకంటే, ఈ కథను సెలక్ట్ చేసింది చిరంజీవి. ఎన్నో సిట్టింగ్స్ తర్వాత ఈ కథకు
ఆయన ఓకే చెప్పారు. తన అంచనా నిజమైనందుకు చిరంజీవి చాలా హ్యాపీగా ఉన్నారు. తన ఆనందాన్ని
యూనిట్ సభ్యులందరితో పంచుకుంటున్నారు.

సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు చిరంజీవి. ఓ నోట్ తో పాటు ఓ మంచి
గిఫ్ట్ కూడా అందించారు. అలాగే దర్శకుడు బుచ్చిబాబుకు కూడా ప్రత్యేకంగా ఓ లెటర్ రాశారు. అందులో
ఆయన్ను మెచ్చుకున్నారు.

ఇలా ఉప్పెన సినిమా సక్సెస్ అవ్వడంతో చిరంజీవి చాలా ఆనందపడుతున్నారు. మరీ ముఖ్యంగా తన చేతుల మీదుగా మరో మెగా హీరో సక్సెస్ ఫుల్ గా లాంఛ్ అవ్వడం కూడా చిరంజీవికి ఆనందాన్నిస్తోంది.

First Published:  22 Feb 2021 2:06 PM IST
Next Story