Telugu Global
NEWS

నిమ్మగడ్డ మరో వివాదానికి తెరతీస్తున్నారా..?

ఎన్నికల సంఘం హక్కులు, అధికారాలపై ఇటీవల కాలంలో ఏపీలో జరిగినట్టు ఇంకెక్కడా చర్చ జరగలేదేమో. ఎన్నికల కమిషనర్ తన పరిధి దాటి ప్రవర్తిస్తున్నారంటూ పదే పదే వైసీపీ ఆరోపణలు చేస్తోంది, అదే సమయంలో తన పరిధిలో తాను ఏ నిర్ణయమైనా తీసుకుంటానంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ అంత‌కు మించి పట్టుదలకు పోతున్నారు. ఏకగ్రీవాలపై ఇటీవలే కోర్టు, ఈసీ పరిధిని ప్రశ్నించిన సందర్భంలో మరోసారి అలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నారు నిమ్మగడ్డ. మున్సిపాల్టీ ఎన్నికల్లో అభ్యర్థులు మరణించిన చోట.. ఎన్నికలు […]

నిమ్మగడ్డ మరో వివాదానికి తెరతీస్తున్నారా..?
X

ఎన్నికల సంఘం హక్కులు, అధికారాలపై ఇటీవల కాలంలో ఏపీలో జరిగినట్టు ఇంకెక్కడా చర్చ జరగలేదేమో. ఎన్నికల కమిషనర్ తన పరిధి దాటి ప్రవర్తిస్తున్నారంటూ పదే పదే వైసీపీ ఆరోపణలు చేస్తోంది, అదే సమయంలో తన పరిధిలో తాను ఏ నిర్ణయమైనా తీసుకుంటానంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ అంత‌కు మించి పట్టుదలకు పోతున్నారు. ఏకగ్రీవాలపై ఇటీవలే కోర్టు, ఈసీ పరిధిని ప్రశ్నించిన సందర్భంలో మరోసారి అలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నారు నిమ్మగడ్డ. మున్సిపాల్టీ ఎన్నికల్లో అభ్యర్థులు మరణించిన చోట.. ఎన్నికలు నిలిపేయాల్సి ఉండగా.. అక్కడ కొత్తగా నామినేషన్లు వేయడానికి వీలు కల్పిస్తూ ఉత్తర్వులిచ్చారు.

గతేడాది ఆగిపోయిన మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు వేసిన 56 మంది అభ్యర్థులు కాలక్రమంలో చనిపోయారు. ఇలా అభ్యర్థి మరణిస్తే, ఆ స్థానంలో ఎన్నిక ప్రక్రియ ఆగిపోయినట్టే. దాన్ని రద్దు చేసి, తర్వాత ఎన్నికలు నిర్వహించడం ఆనవాయితీ. ఇప్పటి వరకూ కమిషనర్ గా ఎవరున్నా, ఎన్నికల కమిషన్ అదే చేస్తోంది. అయితే తొలిసారిగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థులు చనిపోయిన చోట మళ్లీ నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులిచ్చారు. అభ్యర్థులు చనిపోయిన చోట ఎన్నికల ప్రక్రియ నిలిచిపోకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించి, మార్చి 3వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు విధిస్తూ నిమ్మగడ్డ ఉత్తర్వులు జారీ చేశారు. మిగతా ఎన్నికల ప్రక్రియ, కౌంటింగ్ లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు.

కోర్టుకెక్కితే పరిస్థితి ఏంటి..?
ఏకగ్రీవాలపై ఎస్ఈసీ తీసుకున్న సంచలన నిర్ణయంతో.. కొంతమంది అభ్యర్థులు హైకోర్టుని ఆశ్రయించగా.. 243-కె ఆర్టికల్ పరిధి చర్చకు వచ్చింది. ఏకగ్రీవం అయ్యారంటూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఫామ్-10 జారీ చేసిన తర్వాత, తిరిగి దానిపై చర్చలేవనెత్తడంపై కోర్టు అభ్యంతరం తెలిపి, తుది తీర్పు వెలువడే వరకు ఆ ప్రక్రియను వాయిదా వేసింది. తాజాగా కొత్త సంప్రదాయానికి ఎస్ఈసీ తెరతీయడంతో, ఇంకెవరైనా కోర్టుకెళ్తారా అనేది అనుమానంగా ఉంది. అయితే ఎస్ఈసీ తీసుకున్న తాజా నిర్ణయం వల్ల.. ఏ పార్టీకి, ఏ అభ్యర్థికి నష్టం జ‌రిగేది లేదు కాబట్టి.. దీనిపై ఎవరూ న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం లేదని తెలుస్తోంది. ఒకవేళ ఎవరైనా కోర్టుకెక్కితే మాత్రం.. అది మరో చర్చకు దారితీస్తుంది.

First Published:  20 Feb 2021 9:27 PM GMT
Next Story