15 ఏళ్ల కిందటి "చెక్" ఇది
చెక్ సినిమా కథ ఫ్రెష్ కాదంటున్నాడు దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి. డిఫరెంట్ సినిమాలు తీసే ఈ డైరక్టర్.. చెక్ ఐడియా తనకు 15 ఏళ్ల కిందట వచ్చిందన్నాడు. అప్పట్నుంచి వివిధ దశల్లో మారుతూ.. ఫైనల్ గా చెక్ సినిమాగా మారిందని చెబుతున్నాడు. “ఈ ఐడియా 15 ఏళ్లుగా నా మైండ్ లో ఉంది. అలా రకరకాల షేప్స్ తీసుకొని చెక్ గా మారింది. నిజానికి ఇది ఒరిజినల్ ఐడియా కాదు. అలా రూపాంతరం చెంది ఫైనల్ గా చెక్ […]
చెక్ సినిమా కథ ఫ్రెష్ కాదంటున్నాడు దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి. డిఫరెంట్ సినిమాలు తీసే ఈ డైరక్టర్.. చెక్ ఐడియా తనకు 15 ఏళ్ల కిందట వచ్చిందన్నాడు. అప్పట్నుంచి వివిధ దశల్లో మారుతూ.. ఫైనల్ గా చెక్ సినిమాగా మారిందని చెబుతున్నాడు.
“ఈ ఐడియా 15 ఏళ్లుగా నా మైండ్ లో ఉంది. అలా రకరకాల షేప్స్ తీసుకొని చెక్ గా మారింది. నిజానికి ఇది ఒరిజినల్ ఐడియా కాదు. అలా రూపాంతరం చెంది ఫైనల్ గా చెక్ అయింది. ముందుగా నేను అనుకున్న ఐడియాలో జైలు లేదు. ఇప్పుడు చెక్ లో 70శాతం జైలు కనిపిస్తుంది.”
ఇలా చెక్ కథ వెనక జరిగిన తన మేథోమథనాన్ని బయటపెట్టాడు దర్శకుడు. ఈ సినిమాలో కథ కంటే స్క్రీన్ ప్లే చాలా బాగుంటుందని చెబుతున్నాడు దర్శకుడు.
“చెక్ లోనూ స్క్రీన్-ప్లే అందరికీ నచ్చుతుంది. ముఖ్యంగా హ్యూమన్ డ్రామా. సినిమాలో హీరో ఒక
ఉరిశిక్ష పడ్డ ఖైదీ, బాగా తెలివైన వ్యక్తి. రోడ్లు మీద తిరగడు. క్రెడిట్ కార్డ్స్, ఫ్రాడ్స్ చేస్తూ ఉంటాడు. అతని
తెలివితేటలను మీరు ఎలా వాడుకుంటారు? అనుకోకుండా ఒక పెద్ద ప్రమాదంలో జైలులో పడితే ఉరిశిక్ష
పడిపోతుంది. ఇప్పుడు నాలుగు గోడల మధ్య ఇరుక్కుపోయాడు. అతను ఫ్రీగా ఉన్నప్పుడు తెలివితేటలు
తప్పుడు దారికి ఉపయోగపడింది. జైలులో ఎవరో పరిచయం అవ్వడంతో అతని బుర్ర సరైన దారిలో
పడింది.”
నితిన్-ప్రియాప్రకాష్ వారియర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ లాయర్ గా కనిపించనుంది. కల్యాణి మాలిక్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.